ఉప్పు, పసుపు ఎందుకు? పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది జెర్మ్స్ , ఇన్ఫెక్షన్లను తిప్పికొడుతుంది. అంతే కాకుండా చేపలపై సూక్ష్మజీవులు పెరగకుండా ఉండేందుకు ఉప్పు, పసుపు కలిపి మ్యారినేట్ చేస్తారు. అంతేకాకుండా, ఉప్పు కలపడం వల్ల ప్రోటీన్ అధికంగా ఉండే చేప తేలికగా మారుతుంది. కాబట్టి చేపలు తింటే మృదువుగా మారుతుంది.