స్టెరాయిడ్స్, కొన్ని రకాల వైరస్, ఇన్ఫెక్షన్స్, హార్మోన్ల అసమతుల్యత వల్ల మధుమేహం (Diabetes) వస్తుంటుంది. తరచుగా మూత్ర విసర్జన (పాలీయూరియా), పొడి గొంతు లేదా తరచుగా దాహం వెయ్యడం (పాలీడిప్సియా), కంటి చూపు(eye site) మందగించడం., కారణం లేకుండా ఆకస్మిక బరువు పెరుగుట లేదా బరువు తగ్గడం (weight loss), ఒక్కసారిగా నీరసం అలసటగా అనిపించడం అధికంగా ఆకలి వేయడం (Hungry) దీని ముఖ్య లక్షణాలు. (ప్రతీకాత్మక చిత్రం)
వాకింగ్ (walking) చేస్తే డయాబెటిస్ అదుపులో పెట్టవచ్చు. రాత్రిపూట భోజనం తర్వాత వాకింగ్ చేసిన వారిలో ఏకంగా 22 శాతం వరకు షుగర్ లెవెల్స్ తగ్గినట్లు పరిశోధకులు వివరించారు. ఇలా వాకింగ్ చేస్తే మధుమేహం సమస్య దరిచేరదని చెబుతున్నారు. శరీరానికి మానసిక, శారీరక ఉల్లాసం దొరుకుతుందట. వారి పనితీరు సైతం మెరుగైనట్లు ఆ రిపోర్టులో తెలిపారు.
ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లి రసం తాగవచ్చు. ఇలా కూడా చేయలేం అనుకునేవారు వెల్లుల్లి రెబ్బలు 4 తీసుకొని వాటిని కాల్చి తినవచ్చు. షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం. (Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)