హార్ట్ ఎటాక్ రాబోతోంది అనేందుకు ముందుగా కొన్ని సంకేతాలుంటాయి. వాటిలో తలతిరగడం (Dizziness) ఒకటి అని నిపుణులు చెబుతున్నారు. అయితే.. తలతిరగడానికీ, హార్ట్ఎటాక్కీ డైరెక్టుగా ఎలాంటి సంబంధమూ ఉండదని అంటున్నారు. హార్ట్ఎటాక్ లక్షణాల్లో ఒకటిగా తలతిరగడాన్ని చెప్పుకోవచ్చు అంటున్నారు. హార్ట్ ఎటాక్ తరహా కండీషన్లైన ఏంజినా (Angina) లేదా అర్హిత్మియా (arrhythmia)కీ తల తిరగడానికీ సంబంధం ఉంటుంది అంటున్నారు. (image credit - canva)
హార్ట్ఎటాక్ సమయంలో.. గుండె కండరాల్లో రక్త ప్రవాహ సప్లైకి అంతరాయం కలుగుతుంది. దీని వల్ల రొమ్ము నొప్పి, రొమ్ము ఒత్తిడి, ఊపిరి సరిగా ఆడకపోవడం, తల తిరుగుతున్నట్లు అనిపించడం, కళ్లు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బ్రెయిన్‌కి రక్త సరఫరా తగ్గినప్పుడు కూడా తల తిరుగుతుంది. బీపీ (blood pressure) డౌన్ అవుతున్నప్పుడు.. బ్రెయిన్‌కి రక్త సరఫరా తగ్గుతుంది.
కారణాలు : తలతిరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. చెవిలోపల తేడా వస్తే తలతిరగగలదు. అలాగే లోబీపీ వచ్చినా ఇలా అవుతుంది. అప్పటిదాకా కూర్చొని సడెన్‌గా పైకి లెగిస్తే.. తలతిరుగుతుంది. కొన్ని క్షణాలకే సరి అవుతుంది. ఎక్కువసేపు నీరు తాగకపోతే.. డీహైడ్రేషన్ వల్ల బీపీ తగ్గిపోయి.. తలతిరగగలదు. కొన్ని రకాల మందులు వాడినప్పుడు కూడా బీపీ తగ్గిపోయి తలతిరగగలదు. ఆందోళన, ఒత్తిడి ఉన్నవారికి కూడా తలతిరగగలదు. శరీరంలో తగినన్ని ఎర్ర రక్త కణాలు లేనప్పుడు.. బ్రెయిన్, బాడీకి సరిపడా ఆక్సిజన్ అందదు. అప్పుడు తలతిరగగలదు.