ప్రతి రోజు మన జీవితం 'టీ' తోనే ప్రారంభమవుతుంది. ఆ తర్వాత బయటకు వెళ్లినా.. ఆఫీసులో పనిచేస్తున్నా.. అప్పుడప్పుడూ వేడి వేడి 'టీ' కడుపులో పడాల్సిందే. కొందరు అలసట నుంచి ఉపమశనం పొందేందుకు 'టీ' తాగుతారు. మరికొందరేమో తలనొప్పి తగ్గేందుకు, ఇంకొందరు రిఫ్రెషింగ్ కోసం టీ తాగుతుంటారు. మరీ మూడ్‌ని బట్టి ఏ 'టీ' తాగితే బాగుంటుందో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
లావెండర్ ఫ్లేవర్ టీ: మీరు నిద్రపోయే ముందు లావెండర్ ఫ్లేవర్ టీని త్రాగాలి. దీని సువాసన మీ మనస్సుకు, శరీరానినికి రిలాక్సేషన్, రిఫ్రెష్మెంట్ ఇస్తుంది. 2 కప్పుల వేడినీటిలో అర టీస్పూన్ లావెండర్ వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత మంట ఆర్పేసి.. లావెంటర్ ఫ్లేవర్ నీటిలో దిగే వరకుఅలాగే ఉంచాలి. దీనికి 15 నుంచి 20 నిమిషాలు టైమ్ పడుతుంది. ఆ తర్వాత కావాలంటే మరోసారి వేడి చేసుకొని తాగొచ్చు. లేదంటే చల్లారిన టీని కూడా అలాగే తీసుకోవచ్చు.
మసాలా టీ: మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలు వస్తుంటే.. ఇండియన్ మసాలా టీ తాగాలి. అప్పుడు ఆ థాట్స్ నుంచి డైవర్ట్ అవుతారు. ఇండియన్ మసాలా టీ చేయడానికి.. లవంగాలు, యాలకులు, ఎండుమిర్చి, దాల్చినచెక్కను కాస్త వేయించాలి. చల్లారిన తర్వాత జాజికాయ, ఎండు అల్లం వేసి మెత్తగా రుబ్బుకోవాలి. గ్రైండ్ చేసిన మసాలాను నీటిలో వేసి మరిగించాలి. కాసేపయ్యాక టీ ఆకులు వేసి.. మరో 3 నిమిషాలు ఉడికించాలి. చివరగా పంచదార, పాలు వేసి మరో 4నిమిషాలు మరిగించాలి. ఎంతో రుచికరంగా ఉండే హాట్ హాట్ మసాలా టీ సిద్ధనట్లే..!