యువతలో అత్యంత సాధారణ హార్ట్ ప్రాబ్లమ్స్లో.. అన్‌స్టెబుల్ ఆంజినా, హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ ఎటాక్, అరిథ్మియా, గుండె కవాట వ్యాధి (హార్ట్ వాల్వ్ డిసీజ్), అధిక రక్తపోటు, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు వంటివి ఉన్నాయి. అందుకే యువతకు గుండె జబ్బులు వచ్చే ప్రధాన ప్రమాద కారకాలను తెలుసుకుంటే, సమస్యను నివారించడానికి చర్యలు తీసుకోవడం సులభం అవుతుంది.
ప్రధాన కారణాలు : మారిన జీవిన శైలి యువకుల్లో గుండెపోట్లకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. వ్యాయామం చేయకపోవడం, శరీర బరువు పెరిగడం, కొలెస్ట్రాల్, షుగర్ స్థాయిలు పెరగడం వల్ల గుండెపోట్లు అధికమయ్యాయని చెబుతున్నారు బెంగళూరు అపోలో హాస్పిటల్‌కు చెందిన కార్డియాలజిస్ట్ K N సుదీప్. గత దశాబ్దం నుంచి స్మార్ట్ ఫోన్లు పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చివేసినట్లు తెలిపారు. జంక్ ఫుడ్స్, బయటి ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కూడా గుండె వ్యాధుల ప్రమాదం క్రమంగా పెరుగుతోందని వివరించారు.
వంశపారంపర్యంగా గుండె ప్రమాద కారకాలు లేని 20-39 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు.. ప్రతి 4-6 సంవత్సరాలకు ఒకసారి హార్ట్ హెల్త్ చెకప్ చేసుకోవాలని అధ్యయనం తెలిపింది. వంశపారంపర్యంగా CVD కార్డియాక్ హార్ట్ ప్రాబ్లమ్స్, జన్యుపరమైన వ్యాదుల ప్రమాదం ఉన్నవారు కార్డియాలజిస్ట్‌ను సంప్రదించి హెల్త్ చెకప్స్ చేయించుకోవాలని రిసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది.(ప్రతీకాత్మక చిత్రం)
తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. రోజూ శారీరక శ్రమ తప్పనిసరి. వ్యాయామం తప్పకుండా చేయాలి. అలాగని ఒకేసారి ఎక్కువ సమయం వ్యాయామం చేయడం కూడా ప్రమాదమే. ప్రతి వారం 150 నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలి. అంటే రోజూ కనీసం 20 నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలి. వ్యాయామం చేసే సమయంలో ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురైతే నిలిపివేయడం మంచిది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనా, అలసట, గుండె దడ లాంటివి అనిపించినా.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలని కూడా డాక్టర్ సుదీప్ సలహా ఇస్తున్నారు.