IF YOU WANT TO LOOSE HEAVY WEIGHT THEN FOLLOW THIS TWO SIMPLE WEIGHT LOSE TIPS TO LOOSE WEIGHT EASILY PRV
Weight loss tips: మీ బరువును తగ్గించుకునే ప్లాన్లో ఉన్నారా? అయితే ఈ రెండు సింపుల్ చిట్కాలు చాలు..
ప్రతీ ఒక్కరికి బరువు (weight) అనేది ప్రమాదకరమే. దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. మనం తీసుకునే ఆహార పదార్థాలే మన ఆరోగ్యం ఎలా ఉండాలో డిసైడ్ చేస్తాయి. అందుకే సరైన ఆహారం నియమం చాలా అవసరం.
ప్రతీ ఒక్కరికి బరువు (weight) అనేది ప్రమాదకరమే. దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే డాక్టర్లు వ్యాయామాలు (exercises) చేయడం మంచిదని సలహాలు (weight loss tips) ఇస్తుంటారు.
2/ 10
అయితే దానికోసం రకరకాల ఎక్సర్సైజ్లు చేయడం మొదలు పెడతారు. ఒకటి రెండు రోజులు చేయగానే బద్దకంతోనో, పని ఒత్తిడితోనో మధ్యలోనే మానేస్తుంటారు. దీనివల్ల బరువు తగ్గాలన్న (weight loss) కల.. కలగానే ఉండిపోతుంటుంది.
3/ 10
మనం తీసుకునే ఆహార పదార్థాలే మన ఆరోగ్యం ఎలా ఉండాలో డిసైడ్ చేస్తాయి. అందుకే సరైన ఆహారం నియమం చాలా అవసరం. ఈ నియమాన్ని ఎంత శ్రద్ధగా పాటిస్తే మన ఆరోగ్యం అంత మెరుగ్గా ఉంటుంది. ఈ ఆహార నియమాన్ని మీ జీవన శైలిగా మార్చుకోవాలి.
4/ 10
ముఖ్యంగా మీరు తీసుకునే ఆహారంలో (food) ప్రోటీన్లు, మైక్రో, మ్యాక్రో, న్యూట్రియెంట్లతో కూడిన పోషకవిలువలు అధికంగా ఉన్న ఆహారాన్నే తీసుకోవాలి. ఇలాంటి ఆహారాన్ని మీరు గనుక అలవాటు చేసుకుంటే అధిక కొవ్వును కరిగించే పనిని మొదలు పెట్టినట్టే అవుతుంది.
5/ 10
అలాగే సరైన డైట్ (diet) ను ప్లాన్ చేసుకుని క్రమం తప్పకుండా పాటించేలా చూసుకోవాలి. మెరుగైన ఆరోగ్యానిచ్చే ఫుడ్ నే తినాలి. ఏ ఒక్క రోజు కూడా ఈ రూల్ ను అస్సలు తప్పకూడదు. మసాలాలకు దూరంగా ఉండండి.
6/ 10
అలసిన శరీరం తిరిగి శక్తిని పుంజుకోవాలన్నా, ఉత్తేజంగా తయారవ్వాలన్నాకంటి నిండా నిద్ర (sleep) ఎంతో అవసరం. శరీరానికి సరిపడా నిద్ర ఉంటే ఎటువంటి రోగాన్నైనా ఇట్టే తరిమేయొచ్చు. కానీ ప్రస్తుత కాలంలో నిద్రకిచ్చే సమయం చాలా తక్కువ. దాని కారణంగానే అనేక రోగాలు మనల్ని అటాక్ చేస్తున్నాయి.
7/ 10
అనారోగ్యం నుంచి తొందరగా రికవరీ కావాలంటే ముందుగా కావాల్సింది సరిపడా నిద్రనే (enough sleep). ముఖ్యంగా ఎలాంటి ఒత్తిడైనా నిద్రతో మటుమాయం అవుతుంది. కాబట్టి నిద్రను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి.
8/ 10
శరీరంలో బలంగా, ఫిట్ గా ఉండాలంటే వర్కౌట్లు (Workouts) ఖచ్చితంగా చేయాల్సిందే. అయితే బరువును నియంత్రణలో ఉంచడానికి కూడా ఈ వర్కౌట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకని ఒకే సారి భారీ భారీ వర్కౌట్లను చేయడం ప్రమాదం. అలా మీరు చేయలేరు కూడా.
9/ 10
మొదటగా చిన్న చిన్న వర్కౌట్లనే చేయండి. మెల్లి మెల్లిగా మీకే అలవాటు అవుతుంది. అందులోనూ మీకు సూటయ్యే వర్కౌట్లనే ఎంచుకోవడం చాలా బెటర్. కానీ వ్యాయామాలను ఒక సారి అలవాటు చేసుకున్నాకా క్రమం తప్పకుండా చేయాలి. ఒకవేళ మీకు జిమ్ లకు వెళ్లడం ఇష్టం లేకుంటే రన్నింగ్, జాగింగ్ లేదా సైక్లింగ్ చేయవచ్చు.
10/ 10
మీరు ఎలాంటి వ్యాయామం (Exercise) చేసినా క్రమం తప్పకుండా చేయడం అలవాటు చేసుకోండి. ఈ వ్యాయామం కేవలం అధిక క్యాలరీలను కరిగించడమనే భావనే కాకుండా మీ శరీరాన్ని పాజిటివ్ స్ట్రెస్ కు కూడా అలవాటు చేస్తుందని గుర్తించండి.