ఎండాకాలం వచ్చేసింది.చెమటలు, ఎండకు ముఖంలో తేజస్సు కోల్పోవడం జరుగుతుంది. ముఖంలో యవ్వనాన్ని(Young look) కోల్పోకూడదని చాలా మంది భావిస్తారు. ఒక చిన్న తెల్ల వెంట్రుక కనబడితే చాలు అరవై ఏళ్లు వయస్సు ఉన్నట్లు చాలా మంది భావిస్తారు. యవ్వనం(young)గా కనబడేందుకు అనేక మార్గాలను అందిస్తున్నారు. మీరు యవ్వనంగా ఉండాలంటే మీ ముఖం (face) మీద ఉన్న ముడతలను వదిలించుకోవాలి. ఆ తర్వాత యవ్వనం మీ సొంతమవుతుంది.
మొటిమలు బాధిస్తున్నట్లయితే ఆరెంజ్ ప్యాక్ (Orange pack) వాడాలి. ఒక ఆరెంజ్, ఒక టీస్పూన్ పుదీనా, కొంచెం లెమన్ జ్యూస్ కలిపి గుజ్జులా చేసుకుని ముఖానికి పట్టించాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఆరెంజ్‌లో విటమిన్ ‘సి’ పుష్కలం,. యాంటీ ఆక్సిడెంట్లు, జింక్ మొటిమలను నిరోధించడంలో తోడ్పడతాయి.
జిడ్డు చర్మం (Oily skin) ఉన్నవారికి మొటిమల (Pimples) సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రకం చర్మం ఉన్నవారు సిట్రస్ ఫేస్ వాష్, ప్యాక్స్ ఎక్కువ వాడాలి. అందుకే ఈ రకం చర్మం ఉన్నవారు సిట్రస్ ఫేస్ వాష్, ప్యాక్స్ ఎక్కువ వాడాలి. మొటిమల సమస్యతో టీనేజర్లు ఎక్కవగా బాధపడుతుంటారు. సాధారణ చర్మం వారికి అన్ని రకాల ప్యాక్స్ పడవు.