సరిగ్గా బ్రష్ చేయకపోతే దంతాలపై పాచి లేదా ప్లేక్ (plaque) పేరుకుపోతుంది. ఇందులో ఉండే బ్యాక్టీరియా చిగుళ్ల వ్యాధి (gum disease), దంత క్షయానికి (tooth decay) దారితీస్తుంది. సంపూర్ణమైన దంతాల ఆరోగ్యం కోసం ఎలా బ్రష్ చేయాలి? ఎప్పుడు బ్రష్ చేయాలి? ఎలాంటి బ్రష్ యూజ్ చేయాలి? వంటి ముఖ్య విషయాలు తెలుసుకుందాం.(ప్రతీకాత్మక చిత్రం)
ఏ రకమైన టూత్‌పేస్ట్‌ని ఉపయోగించాలి?
ఫ్లోరైడ్ సరైన సాంద్రత కలిగిన టూత్‌పేస్ట్‌ను ఉపయోగించడం చాలా ముఖ్యం. ప్రతి బ్రాండ్‌లో ఎంత ఫ్లోరైడ్ ఉందో తెలుసుకోవడానికి ప్యాకేజింగ్‌ను చెక్ చేయండి. పెద్దలు కనీసం 1,350 పార్ట్స్ పర్ మిలియన్ (పీపీఎమ్) ఫ్లోరైడ్ని కలిగి ఉండే టూత్‌పేస్ట్‌ని ఉపయోగించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
టూత్ బ్రషింగ్ తర్వాత పళ్ళను నేరుగా నీటితో శుభ్రం చేయకూడదు బ్రష్ చేసిన తర్వాత అదనపు టూత్‌పేస్ట్‌ను ఉమ్మివేయాలి కానీ బ్రష్ చేసిన వెంటనే మీ నోరు కడుక్కోవద్దు. ఎందుకంటే మిగిలిన టూత్‌పేస్ట్‌లో గాఢమైన ఫ్లోరైడ్ని అది కడిగివేసే అవకాశం ఉంది. దీనివల్ల ఫ్లోరైడ్ శక్తిహీనంగా మారి పళ్ల ఆరోగ్యానికి ఏ విధంగానూ సహాయపడదు.(ప్రతీకాత్మక చిత్రం)
దంతాల మధ్య ఎక్కువ ఖాళీ ఉన్నట్లయితే మీరు ఫ్లాసింగ్కు బదులుగా ఇంటర్డెంటల్ బ్రష్‌లు లేదా సింగిల్ టఫ్టెడ్ బ్రష్‌లను ఉపయోగించవచ్చు. మీ దంతాల్లో చిక్కుకున్న ఫుడ్ తొలగించడానికి టూత్‌పిక్‌లను ఎప్పుడూ ఉపయోగించవద్దు. ఎందుకంటే ఇది చిగుళ్ళను దెబ్బతీస్తుంది. తరువాత అది ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)