వీటిని తగ్గించుకోవడానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలు (Ayurveda tips) చెబుతున్నారు సౌందర్య నిపుణులు. సమతుల్యమైన జీవనశైలి, మంచి ఆహారపుటలవాట్లు, చురుకుగా ఉండటం, మేలైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ (skin care products), బ్యూటీ టిప్స్ (beauty tips) వాడటం ద్వారా మొటిమల సమస్యకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు. అందులో ఒకటే టమాట (tomato).. దీన్ని ఉపయోగించి ఎలా అందంగా తయారవ్వొచ్చో చూద్దాం..
కాసింత శనగ పిండిని తీసుకోండి. అందులో ఇప్పుడు టమాట (tomato) గుజ్జుని అందులో కలపాలి. మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇలా తయారైన ప్యాక్‌ని ముఖానికి పూతలా వేయాలి. ఆరిన తర్వాత నీళ్లు చల్లుకుంటూ స్క్రబ్‌లా చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం తాజాగా మారుతుంది. ముఖ రంగుని మెరుగుపరచడంలో ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది.
ఓపెన్ పోర్స్ సమస్య ఉన్నవారు కాస్తా ముల్తానీ మట్టి తీసుకోండి. అందులో టమాట జ్యూస్ (tomato juice) వేసి బాగా కలపండి. ఇలా తయారైన ప్యాక్‌ని ముఖంపై వేసుకోండి.. చల్లని నీటితో కడగండి.. ఇలా చేయడం వల్ల చాలా వరకూ తగ్గుతుంది. ఎండకు కమిలిన చర్మాన్ని (skin) తిరిగి అందంగా మార్చడంలో టమాటా (tomato) బాగా పనిచేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)