IF YOU FACING HAIR FALL PROBLEMS HEAVILY THEN FOLLOW THIS METHODS FOR STRONG HAIR PRV
Hair problem tips: మీ జుట్టు బలంగా లేదా? రాలిపోతోందా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..
జుట్టు రాలడం ప్రస్తుతం చాలా మంది ఇబ్బంది పడుతున్న సమస్య. అయితే జుట్టు రాలేదాకా కాకుండా ముందుగానే జాగ్రత్త పడితే మేలు. ఎటువంటి ఆహారం తీసుకొంటే జుట్టుకు మెరుగైన పోషకాలు అందుతాయో తెలుసుకోండి.
సగటు జీవిలో జుట్టు (hair) రాలిపోతుండటాన్ని (loss) చూసి తట్టుకోలేడు. ఇక అమ్మాయిలైతే (girls) మరేమరి. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడలో అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు.
2/ 9
మహిళల కురులు (women hairs) మగవారికీ ఇష్టమే. కేశాలు ఎంత బాగా ఉంటే అంత అందంగా (beauty) కనిపిస్తారు. జుట్టు ఎంత బాగుంటే అన్ని రకాల హెయిర్ స్టైల్స్‌ను ఫాలో అవుతారు.
3/ 9
అయితే జుట్టు ఆడవారిలోనే కాదు మగవారికీ అందాన్ని చేకూరుస్తాయి. కాకపోతే మగవారు బట్టతల వస్తుందని తెలిసే సరికి పట్టించుకోవడం మొదలెడతారు. ఇక సెలెబ్రెటీలైతే సరే సరి వారి కోసం పర్సనల్ హెయిర్ స్పెషలిస్టులను పెట్టుకుంటారు.
4/ 9
అయితే మనలో చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (hair fall) జరుగుతుంది. జుట్టు (hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అలాంటి జుట్టు పొడుగుగా (long) పెరగాలంటే కొన్ని చిట్కాలు (Hair problem tips) పాటిస్తే సత్ఫలితాలిస్తాయంట.
5/ 9
జుట్టు రాలడం, అవాంఛిత రోమాల సమస్యలతో పాటు మీరు అధిక బరువుతో కూడా ఉన్నట్టయితే అది హార్మోనుల వల్ల కావచ్చు. ముందుగా మీ లక్షణాలకు కారణాన్ని వైద్యుల సహాయంతో నిర్ధారించుకోవడం శ్రేయస్కరం.
6/ 9
జుట్టు రాలడాన్ని నివారించడానికి ఆహారంలో కొన్ని రకాల జాగ్రత్తలు (Hair problem tips) తీసుకుంటే మంచిది. ఆహారంలో ప్రొటీన్లు అధికంగా ఉండేలా చికెన్ (Chicken), చేప (Fish), గుడ్లు (eggs) లాంటివి తప్పకుండా తీసుకోండి.
7/ 9
అంతే కాకుండా బాదం (Almonds), ఆక్రోట్, నువ్వులు, అవిసెగింజలు మొదలైన వాటిల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు కూడా మీ సమస్య నివారణకు కొంత వరకు ఉపయోగపడతాయి.
8/ 9
మాంసాహారంతో పాటు పాలు (Milk), పెరుగు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు కూడా ఎంతో అవసరం. వీటన్నిటిలో ఉన్న ఐరన్, జింక్, సెలీనియం మొదలైన ఖనిజాలు జుట్టు రాలకుండా ఆరోగ్యంగా పెరగడానికి అత్యవసరం.
9/ 9
ఆహారంలో జాగ్రత్తలతో పాటు, మీ జీవన విధానంలో ఆందోళనను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తే మంచిది. రాత్రి కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర (Sleep) కూడా అవసరం.