ఫ్రిజ్ సహజ వాతావరణానికి భిన్నంగా ఉంటుంది. ఫ్రిజ్లోని చలి కృత్రిమంగా ఉంటుంది. సాధారణంగా ఫ్రిజ్ లోంచి చల్లార్చిన నీటిని తాగడం వల్ల పెద్దగా దుష్ప్రభావాలు ఏమీ ఉండవు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. చల్లటి నీరు ఎక్కువగా తాగకూడదు. ఎందుకంటే, జీరో డిగ్రీ పరిధిలో ఉన్న నీరు, మన ఆరోగ్యానికి ప్రమాదకరం. ఆ నీటిని తాగడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి. అవి ఏంటో తెలుసా?(ప్రతీకాత్మక చిత్రం)
Brain Freeze:చల్లటి నీరు ఎక్కువగా తాగితే, త్వరగా తాగితే ఒక్కసారిగా తలనొప్పి వస్తుంది. దీనినే బ్రెయిన్ ఫ్రీజ్ అంటారు. దీనిని ఐస్క్రీం హాడాక్ అని కూడా అంటారు. ఈ తలనొప్పి ఎలా వస్తుందంటే చల్లటి నీరు వెంటనే రక్తనాళాలకు తాకుతుంది. ఇది తలపైకి వెళుతుంది. ఇక్కడ నీరు వేగంగా విస్తరిస్తుంది. ఇది స్వల్పకాలిక తలనొప్పికి కారణమవుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)