దంపతుల్లో నమ్మకం చాలా ముఖ్యం. పెళ్లి బంధానికి నమ్మకం ఒక పిల్లర్ వంటిది. ఇది లేకుంటే..ఆర్గ్యూమెంట్స్, అపార్థం, అపనమ్మకానికి దారితీస్తుంది. మీరూ ఇదే పరిస్థితిలో ఉన్నారా? మరి అప్పుడు మీరేం ప్రయత్నాలు చేస్తున్నారు? ఒకవేళ భర్తపై లేనిపోని అనుమానాలు పెట్టకున్నా.. ఇతర ఇబ్బందులకు దారితీస్తుంది. కానీ, కొన్ని చిట్కాలు పాటిస్తే ఒక మార్గం లభిస్తుంది.
మీరు మీ భర్తతో మాట్లాడలేనప్పుడు, మీ సన్నిహితులు లేదా స్నేహితులతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకోవాలి. అంతేకాదు ఒక ప్రొఫెషనల్ నిపుణుడి సహాయం కూడా తీసుకోవాలి. ఎందుకంటే అప్పుడే మీకు సరైన దిశానిర్ధేశం, మార్గదర్శకత్వం లభిస్తుంది. మోసం చేసిన భర్తలను క్షమించడం అంటే వారిని.. తిరిగి జీవితంలోకి తీసుకురావడం అని అర్థ. అతడిపై మీరు పూర్తిగా నమ్మకాన్ని సంపాదించుకోవాలి. క్షమాపణ అంటేనే మీ జీవితంలోకి తిరిగి ప్రవేశించడానికి మీరు అనుమతి ఇచ్చారని కాదు. వాటి మధ్య తేడా తెలుసుకోవాలి.