ఒక బౌల్లో రెండు టీస్పూన్ల ముల్తానీ మట్టి తీసుకుని అందులో అర టీస్పూన్ పసుపు (Turmeric), అర టీస్పూన్ గంధం, కొద్దిగా నిమ్మరసం వేసి పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి పట్టించి బాగా ఆరేంత వరకు ఉంచాలి. తరువాత చల్లటి నీటి (Cold water)తో కడిగేయాలి. వారంలో రెండు రోజులు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.