అందుకే బరువు తగ్గాలనుకునేవారు, బరువు పెరగకూడదనే వారు చెడు ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. లేదంటే జిమ్‌లకు వెళ్లి ఎంత కఠినమైన కసరత్తులు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. మరి బరువు పెరగడానికి కారణమయ్యే, బరువు తగ్గడానికి (Weight Loss) ఆటంకం కలిగించే చెడు ఆహారపు అలవాట్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
3. సమయంతో సంబంధం లేకుండా తినడం : ఖాళీ సమయం దొరికితే చాలు కొందరు ఏదో ఒక స్నాక్ ఆరగించకుండా ఉండలేరు. సినిమా చూస్తూనో లేదా ఇతరులకు కబుర్లు చెబుతూనో వీరు తమకు తెలియకుండానే ఎక్కువగా ఆహారం తింటుంటారు. ఇలాంటి ఆహారపు అలవాటు ఉంటే బరువు తగ్గడం ఎప్పటికీ సాధ్యం కాదు. అంతేకాదు ఇంకా ఎక్కువ బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది.
4. చాలా త్వరగా తినడం : సాధారణంగా కడుపు నిండిందనే భావన కలగాలంటే 20 నిమిషాలు పడుతుంది. అయితే చాలా ఫాస్ట్‌గా తినడం వల్ల త్వరగా కడుపు నిండుతుంది కానీ ఇంకా ఆకలిగా ఉన్నట్టే అనిపిస్తుంది. దీనివల్ల మీరు అలాగే చాలా ఎక్కువ ఫుడ్ తినే అవకాశముంది. ఫలితంగా కావలసిన దానికంటే ఎక్కువ తిని బరువు పెరుగుతారు. అందుకే ఈ అలవాటును మానేసి నెమ్మదిగా తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. అలాగే తక్కువ ఆహారం ఉన్నట్లవుతుంది.