Durga puja: దుర్గాపూజ 2021 పూజ హడావుడిలో కొన్ని అనారోగ్య సమస్యలు రావచ్చు. అంటే ముఖ్యంగా ఆహారానికి సంబంధించి. రకరకాల వంటలు, పిండి పదార్థాలు, అవి కాకుండా స్వీట్స్ కూడా తినాల్సి వస్తుంది. మొత్తం అది మన కడుపుపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పండుగల సమయాల్లోనే మనం రోజు తినే ఆహారం కంటే కాస్త.. ఎక్కువగా లాగిస్తాం.
అయితే, ఈ అజీర్తి Indigestion సమస్యలకు మన వంటింట్లో ఉండే పదార్థాలతో నివారించవచ్చు. వీటితో సులభంగా కడుపు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఇప్పటికే మన భారతీయ వంటిల్లులోనే అనేక ఆరోగ్య సమస్యలను తీర్చే పదార్థాలు ఉన్నాయని అందరికీ తెలుసు. కడుపు సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడితే, ఏమాత్రం భయపడకండి. వీటితో ఓసారి ట్రై చేసి చూడండి.
Lifestyle లైఫ్‌స్టైల్ నిపుణులు కొన్ని డ్రింక్‌లను సూచిస్తున్నారు. అది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి ఒక చెంచా జీలకర్ర, సోంపు, నల్ల మిరియాలు నాలుగు, వాము ఈ సుగంధ ద్రవ్యాలను ఒక లీటరు మంచి నీటిలో కలుపుకోవాలి. దీన్ని స్టవ్‌పై పెట్టి మరిగించుకోవాలి. సుమారు 5–6 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత వడకట్టాలి. ఈ డ్రింక్‌ను తీసుకున్నపుడల్ల సుమారు 200 మీలీ తీసుకోవాలి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. అంటే, కడుపు ఉబ్బరం, గ్యాస్, గుండెల్లో మంట, మలబద్ధకం constipation నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.