* థైరాక్సిన్ హార్మోన్ : థైరాయిడ్ అనేది మెడకు ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఎండోక్రైన్ గ్రంథి. థైరాక్సిన్ అనే థైరాయిడ్ హర్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరంలోని జీవక్రియను సమతులంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఒకవేళ ఈ హర్మోన్ తక్కువ లేదా ఎక్కువగా ఉత్పత్తి అయితే జీవక్రియ దెబ్బతింటుంది. దాని వల్ల బరువు పెరగడం, జుట్టు రాలడం, గుండె జబ్బులు, హార్మోన్ల అసమతుల్యత, మధుమేహం, ఎముక బలహీనత వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి.
* హైపోథైరాయిడిజం : తగినంత థైరాక్సిన్ ఉత్పత్తి కాకపోతే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. దీని వల్ల వేగంగా బరువు పెరుగుతారు. ఏ వయసు వారికి అయినా వస్తుంది. అలసట, చలి, మలబద్ధకం, ముఖం ఉబ్బినట్లు ఉండటం, పొడి చర్మం, కొలెస్ట్రాల్ పెరగడం, కీళ్లల్లో నొప్పులు, డిప్రెషన్ లేదా బలహీనమైన జ్ఞాపకశక్తి వంటి లక్షణాలు ప్రాథమికంగా కనిపిస్తాయి. వీరు అధికంగా బరువు పెరుగుతారు.
* ఇతర సూచనలు : థైరాయిడ్ సమస్యలకు దూరంగా ఉండాలంటే అయోడిన్ లభించే ఫుడ్స్ తినాలని ఎడ్వినా రాజ్ సూచిస్తున్నారు. అయోడిన్ ఎక్కువగా ఉండే ఉప్పు చేపలు, పాల ఉత్పత్తులు వంటి కూడా మంచివి. హైపోథైరాయిడిజం బాధితులు ఎక్కువగా జింక్, సెలినీయం, ఫైబర్ తదితర ఖనిజాలు ఉండే ఆహారం తీసుకోవడం మంచిదని ఎడ్వినా తెలిపారు.
థైరాయిడ్ సమస్య వల్ల భవిష్యత్తులో అనేక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే బాధితులు ముందుగానే జాగ్రత్త పడాలని ఎడ్వినా రాజ్ సూచిస్తున్నారు. పైన సూచించిన ఆహారంతో పాటు తీసుకునే మందులకు ఆటంకం కలిగించే కాఫీ, సోయా, బొప్పాయి, ద్రాక్షపండు, ఫైబర్ కాల్షియం కలిగిన వాటిని ఉదయం ఆహారంలో తీసుకోకూడదు. ఆయోడైజ్డ్ ఉప్పును మాత్రమే వాడండి. క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీ, కాలే, పెర్ల్ మిల్లెట్, వేరుశెనగ నూనె వంటి వాటిని తక్కువ మొత్తంలో తీసుకోండి. పూర్తిగా మానేయకూడదు. ఎప్పటికప్పుడు వైద్యుడిని కలిసి, తగిన పరీక్షలు చేయించుకోవాలని అంటున్నారు. వైద్యుల సూచనల మేరకు మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.