మీకు జుట్టు రాలిపోతోందా? రోజూ 100 వెంట్రుకలు రాలడం, మరో 100 కొత్తవి రావడం కామన్. అంతకంటే ఎక్కువ రాలిపోతూ ఉంటే.. అందుకు కారణాలు ఏవైనా సరే.. పరిష్కారం మాత్రం భృంగరాజ్. వెంటనే వాడటం మొదలుపెట్టేయండి. ఆలస్యం అమృతం విషం కాబట్టి.. లేట్ చెయ్యొద్దు. ఆయుర్వేదంలో 5వేల సంవత్సరాలుగా భృంగరాజ్ తిరుగులేని తైలంగా ఉంది. చుండ్రు, జుట్టు డ్యామేజ్ అవడం, రాలిపోవడం ఇలాంటి సమస్యలకు సరైన ఆన్సర్ ఈ ఆయిల్. మార్కెట్లో కెమికల్స్‌తో కూడిన ఆయిల్స్ చాలా ఉంటాయి. వాటికి ఎట్రాక్ట్ కావద్దు. భృంగరాజ్ వాడండి చాలు. (image credit - twitter - @dhfn2000)
భృంగరాజ్ వల్ల 1.జుట్టు బాగా పెరుగుతుంది. 2.జుట్టు సిల్కీగా మెరుస్తుంది. 3.జుట్టును తేమగా ఉంచుతుంది. 4.జుట్టుకి ఫంగస్ రానివ్వదు. 5.తలపై కురుపులు, నొప్పి, మంట రానివ్వదు. 6.చర్మం పొలుసుల్లా రాలేలా చేసే సొరియాసిస్ (psoriasis)ని రానివ్వదు. 7.కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి జుట్టు రాలదు. 8.వెంట్రుకలు చిట్లనివ్వదు. 9.జుట్టు బలంగా ఉండేలా చేస్తుంది. 10.జుట్టును త్వరగా తెల్లబడనివ్వదు. 11.రక్త ప్రసరణ బాగా అయ్యేలా చేసి.. జుట్టుకి అన్ని రకాలుగా మేలు చేస్తుంది. ఇంకా స్ట్రెస్ తగ్గడానికీ, మెమరీ పవర్ కోసం కూడా ఈ నూనె ఉపయోగపడుతోంది. (image credit - twitter - @yatharthanubhav)
భృంగరాజ్ తైలాన్ని జుట్టుకి రాసుకునేటప్పుడు.. కొద్దిగా వేడి చెయ్యాలి. లేదా.. చేతిలో వేసుకొని.. అరచేతుల నిండా ఆయిల్ అంటుకునేలా చేసుకోండి. అరచేతుల వేడికి.. ఆయిల్ వేడెక్కుతుంది. అప్పుడు దాన్ని జుట్టుకి రాసుకోండి. గోరు వెచ్చని ఆయిల్‌ని జుట్టుకి రాసుకోవడం వల్ల అది జుట్టుపై మరింత బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తలకు రాసుకున్నాక బాగా, నెమ్మదిగా మసాజ్ చేసుకోండి. జుట్టుకి రాశాక.. కనీసం 4 గంటలు వెంట్రుకలను కడగవద్దు. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. (image credit - twitter - @yatharthanubhav)