కంప్యూటర్, ఫోన్లు వాడే సమయంలో చాలా మంది కనురెప్ప వేయకుండా అదే పనిగా చూస్తుంటారు. ఇలా చేస్తే కళ్లు పొడిబారతాయి. అందుకే కనురెప్పలను నిత్యం ఆడిస్తుండాలి. ఏ ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ను అయినా నిత్యం వాడకుండా.. గ్యాప్ ఇస్తుండాలి. అలాగే స్క్రీన్లను చూసే సమయంలో యూవీ కిరాణాల నుంచి కాపాడే బ్లూ లైట్ ఫిల్టర్ గ్లాసులను ఉపయోగించాలి. Photo from Pexels
కాలుష్యంలో ఎక్కువగా తిరిగినా, సీ-విటమిన్ లోపించినా, కాంటాక్ట్ లెన్స్ ఎక్కువగా వాడినా, స్మోకింగ్ ఎక్కువగా చేసినా, కంప్యూటర్‌పై ఎక్కువగా పని చేసినా, యాబై ఏళ్లు నిండిన మహిళలు, బీపీ, అలర్జీ, మానసిక వ్యాధికి సంబంధించిన, గర్భనిరోధక మందులు వాడే వారితో పాటు.. కీళ్ల నొప్పులు, డయాబెటిస్ ట్యాబ్లెట్స్ వాడే వారిలో డ్రై ఐస్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. Photo from Pexels
టీ, కాఫీ, ఆల్కహాల్ వంటి కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు కంటి ఆరోగ్యానికి హాని చేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచింది. చక్కెర ఎక్కువగా ఉండే పానియాలు, స్వీట్స్ తీసుకోవడం తగ్గించాలి. రిఫైన్డ్ ఆహార పదార్థాలను వాడటం తగ్గించాలి. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాన్ని కూడా తగ్గించాలి. ఇవన్నీ కళ్లను పొడిబారేలా చేస్తాయి. Photo from Pexels