రొమాంటిక్ మూవీ: ప్రేమలో ఉన్న ప్రతీ అమ్మాయి, అబ్బాయి రొమాంటిక్ సినిమాను ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. ఆమెను మూవీకి ఇన్వైట్ చేయండి. మీరు ఏం ప్లాన్ చేస్తున్నారో ఆమెకు హింట్ ఇవ్వకండి. సినిమాలో హార్ట్ టచింగ్ సీన్స్ అప్పుడు ఆమెవైపు ఓ లుక్కేయండి. మీరు మాటల్లో చెప్పే ముందు మీ హావభావాల ద్వారా ఆమెకు మీ ప్రేమను తెలిసేలా చేయండి. మీరు చూస్తున్న సినిమాల్లోని డైలాగ్స్, సీన్స్‌ని యూజ్ చేసుకునే ఓ అందమైన వ్యాఖ్యంతో థియేటర్లోనే ప్రపోజ్ చేయండి. photo from igp.com
టెక్స్ట్: ప్రపోజ్ చేయడానికి చాలా మంది షై ఫిల్ అవుతారు.. ఎందుకో ఎదురుగా ఉన్నప్పుడు ప్రపోజ్ చేయలేరు. అలాంటి వారు మెసేజ్ ద్వారా ప్రపోజ్ చేయండి.. ముందుగా మీ టెక్స్ట్‌ను కంపోజ్ చేసుకోండి. దాన్ని క్రాస్ చెక్ చేసుకోండి. తర్వాత మెసేజ్ సెండ్ కొట్టండి. ఆమె రిప్లై కోసం వెయిట్ చేయండి. కంగారు పడి మెసేజ్ రాలేదని మళ్లి ఇంకో మెసేజ్ చేయకండి. ఆమెకు ఆలోచించుకునే టైమ్ ఇవ్వండి. photo from igp.com
ఆమె కోసం వంట చేయండి: ఆమె ఫుడ్ లవరా..? ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ తింటుందా..? అయితే ఆమెకు ఏ ఫుడ్ ఐటెం బాగా ఇష్టామో తెలుసుకోండి. ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి ఆమెను ఇన్వైట్ చేయండి. ఆమెకు నచ్చిన ఫుడ్‌ని మీరే ప్రిపేర్ చేసినట్లు చెప్పి.. ఆ బాక్స్ తనకు ఇవ్వండి. ఆమె తింటూ ఉండగా మీ మనసులోని భావాలను బయట పెట్టండి. photo from igp.com
పజిల్: చాలా క్రియేటివిటీగా ఆలోచించండి. మీరు మీ ధైర్యాన్ని కోల్పోకుండా చాలా సృజనాత్మకంగా ఉండాలనుకుంటే, ఆమె కోసం ఒక పజిల్ గేమ్‌ను సృష్టించండి. లవ్ షేప్‌లో ఆమె ఫేస్‌ను పెట్టండి. ఆ పజిల్ సాల్వ్ చేస్తే ఆమె ఫోటో ఆమెకు కనిపించాలి. గేమ్‌ను మరి టఫ్‌గా కాకుండా సింపుల్‌గా క్రియేట్ చేయండి. ఆమె పజిల్ సాల్వ్ చేసేలా క్రియేట్ చేయండి. సాల్వ్ చేయగానే ఆమెకు తన హార్ట్ షేప్‌లో తన ఫేస్ కనిపించాలి. photo from igp.com
కాఫీ ప్రపోజల్: ఆమెకు కాఫీ అంటే ఇష్టమా? ఆమెకు ఇష్టమైన కాఫీ షాప్‌లో క్యాజువల్ కాఫీ డేట్‌కు తీసుకెళ్లండి. సాధ్యమైనంత వరకు నార్మల్‌గా ఉండటానికి ప్రయత్నించండి. ఏదో కాఫీ షాప్‌కే వచ్చాం అన్నట్లు బిహేవ్ చేయండి. ఆమె ఆర్డర్ చేసే కాఫీపై 'ఐ లవ్ యూ' అని రాయమని కాఫీ మేకర్‌కు చెప్పండి. అది చూడగానే ఆమెకు సంతోషం కలగడం గ్యారెంటీ. photo from igp.com