సాధారణంగా రోజువారీ కార్యకలాపాల సమయంలో చర్మం పై పొరపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ దానంతట అదే రాలిపోతుంది. కానీ పొల్యూషన్ ,స్కిన్ ప్రొడక్ట్స్ వల్ల చాలా సార్లు అవి రంధ్రాలలో కూరుకుపోతాయి. వాటి వల్ల మొటిమలు, దద్దుర్లు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ సమస్య మొదలవుతుంది. అటువంటి పరిస్థితిలో, డెడ్ స్కిన్ అంటే పాత కణాలను ఎక్స్ఫోలియేట్ చేయడం అవసరం. అయితే, ఎక్స్ఫోలియేషన్ సమయంలో మీ చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం.
ఎందుకంటే కొన్నిసార్లు దీనికోసం వాడే ఉత్పత్తులు చర్మానికి కూడా హాని కలిగిస్తాయి. ప్రతి 30 రోజులకు మన చర్మం పాత డెడ్ స్కిన్‌ను విడిచిపెట్టి, సహజంగా వాటిని కొత్త పొరతో భర్తీ చేస్తుంది. అయితే ఈ డెడ్ స్కిన్ చర్మానికి అతుక్కుపోతే చర్మ రంధ్రాలు మూసుకుపోయి అనేక సమస్యలు మొదలవుతాయి. అటువంటి పరిస్థితిలో డెడ్ స్కిన్ తొలగించడానికి, మీరు కొన్ని హోం రెమిడీస్ తో ఇంటిలోనే ఫేస్ స్క్రబ్‌ను తయారు చేసుకోవచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల చర్మం శుభ్రంగా మెరుస్తుంది. వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
ఈ స్క్రబ్ తయారు చేయడానికి 1 టేబుల్ స్పూన్ గ్రీన్-టీ, 1 టేబుల్ స్పూన్ చక్కెర, 1/2 టీస్పూన్ తేనె అవసరం. ముందుగా బాణలిలో నీటిని మరిగించి అందులో గ్రీన్ టీ కలపండి. ఇప్పుడు దానికి గ్రీన్-టీ వేసి, గ్రీన్-టీ ఉడికి, చల్లారిన తర్వాత బాటిల్లో నింపి ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవాలి. ఇప్పుడు మీరు స్క్రబ్ సిద్ధం చేయాలనుకున్నప్పుడు, ఈ నీటిని ఉపయోగించండి. దీని కోసం, మీరు గ్రీన్-టీ నీటిలో చక్కెర ,తేనె కలపాలి. పొడి చర్మం ఉన్నవారికి ఈ స్క్రబ్ ఉత్తమమని గుర్తుంచుకోండి.
ఈ బొప్పాయి స్క్రబ్ చేయడానికి 1 టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జు, 1 టేబుల్ స్పూన్ ఓట్స్ అవసరం. దీన్ని చేయడానికి మీరు మొదట ఒకటి లేదా రెండు బొప్పాయి ముక్కలను గుజ్జుగా చేయాలి. ఇప్పుడు ఈ బొప్పాయి గుజ్జులో ఓట్స్ జోడించండి. ఈ పేస్ట్‌ని ముఖంపై 2 నిమిషాల పాటు స్క్రబ్ చేయండి. కావాలంటే మిక్సీలో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. మీకు ఆయిల్ స్కిన్ లేకపోతే పాలను కూడా కలుపుకోవచ్చు. మీ చర్మంపై మొటిమలు ఉంటే, దీన్ని ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి.
ఆరెంజ్ పీల్ స్క్రబ్.. తయారు చేయడానికి 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, 1 టీస్పూన్ పచ్చి పాలు ,5 చుక్కల కొబ్బరి నూనె అవసరం. దీన్ని తయారు చేసేందుకు ముందుగా నారింజ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నారింజ తొక్కల పొడిని తీసుకుని అందులో పచ్చి పాలు, కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమంతో ముఖాన్ని బాగా స్క్రబ్ చేయండి. తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. మీరు జిడ్డుగల చర్మం కలిగి ఉంటే, మీరు పచ్చి పాలకు బదులుగా పెరుగును ఉపయోగించవచ్చు