జామాకు నీరు..
కొన్ని జామ ఆకులను కడిగి ఒక లీటరు నీటిలో వేసి మరిగించాలి. 15- 20 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత చల్లారనివ్వాలి. ఆ తర్వాత స్ప్రే సీసాలో నిల్వ చేసుకోవాలి. తర్వాత స్ప్రే బాటిల్ సహాయంతో జుట్టుకు పట్టించాలి. 10 నిమిషాల పాటు మసాజ్ చేసి, జామాకు నీటిని జుట్టుపై కొన్ని గంటలపాటు అలాగే ఉంచాలి. అప్పుడు సాధారణ నీటితో జుట్టు శుభ్రం చేసుకోవచ్చు.
ఆయిల్ తయారీ..
జామ ఆకులను కడిగి బ్లెండర్లో చిక్కని పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కోయాలి. ఇప్పుడు దానిని ఒక గుడ్డలో వేసి ఉల్లిపాయ రసాన్ని పిండాలి. ఇప్పుడు ఉల్లిపాయ రసంలో జామ ఆకుల పేస్ట్, కొబ్బరి నూనె కలపండి. దీన్ని మీ జుట్టుకు పట్టించి వేళ్లతో మసాజ్ చేయండి. అరగంట తర్వాత కడిగేయాలి.