Onion Juice: ఉల్లిపాయ ఉపయోగించకుండా ఎన్ని రకాల వంటలు వండుతారు..? అంటే చెప్పడం చాలా కష్టమే.. ఎందుకంటే ఉల్లిపాయ వాడని ఇళ్లు అంటూ ఉండదు. భారతీయ వంటల్లో ఇది చాలా ముఖ్యమైంది. అయితే ఇప్పటి వరకు పచ్చి ఉల్లి. కూరల్లో వాడే ఉల్లి మాత్రమే మేలు చేస్తాయని విన్నాం.. కానీ ఉల్లి జ్యూస్ (Onion juice) వీటన్నింటికన్నా చాలా ముఖ్యమైంది.
ఉల్లిని రసంగా చేసి తాగితే.. కిడ్నీలో రాళ్ల సమస్యను పరిష్కరిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఉల్లిపాయ రసం తాగితే రాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిత్యం ఇలా చేస్తే త్వరగానే రాళ్లు కరుగుతాయని.. అసలు వైద్యుడితోనే పని ఉండదు అంటున్నారు. సో కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఆలస్యం చేయకుండా ఉల్లి జ్యూస్ తాగండి..
ఉల్లిపాయ రసంతో కీళ్ల నొప్పి తగ్గించవచ్చు. ఆవ నూనెను ఉల్లిపాయ రసంతో కలిపి మసాజ్ చేస్తే సరిపోతుంది. దీంతో పాటు ఉల్లిపాయ రసం జుట్టు రాలే సమస్యని నిరోధిస్తుంది. అలాగే జుట్టు, చర్మానికి కూడా ఉపయోగపడుతుంది. కలబంద, కొబ్బరి నూనె, ఉల్లిపాయ రసాన్ని మిక్స్ చేసి జుట్టుకు రాయడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.
ఉల్లిపాయ రసం, ఆవనూనె సమానంగా కలిపి వేడి చేసి మర్దన చేస్తే అన్ని రకాలైన నొప్పులు తగ్గుతాయి. దీంతో పాటు మూత్ర పిండాలు, మూత్రాశయంలో రాళ్లు ఏర్పడితే ఉల్లిపాయలను సన్నగా తరిగి పెరుగులో కలిపి ప్రతి రోజూ ఉదయం పూట తింటే రాళ్లు కరిగిపోతాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లిని జ్యూస్ చేసి వాడుకోవడం అంత ఈజీ కాదు.. మార్కెట్ లో ఉల్లి ధరలు పూర్తిగా ఘాటెక్కిస్తున్నాయి. కట్ చేయకుండానే కన్నీరు పెట్టిస్తున్నాయి.