కావాల్సినవి : చికెన్ 700 గ్రాములు, ఉప్పు రుచికి సరిపడా, దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు అర టీస్పూన్, గరం మసాలా పొడి 1 టీస్పూన్, బిర్యానీ మసాలా 1 టీస్పూన్, పెరుగు 3 టేబుల్ స్పూన్లు, బాస్మతీ రైస్ 2 గ్లాసులు తీసుకోండి. (image credit - youtube - Mana Chef)
ఇంకా : 3 టేబుల్ స్పూన్ల నూనె, సాజీర 1అర టీస్పూన్, బిర్యానీ ఆకు 1, దాల్చిన చెక్క ఒక అంగుళం, లవంగాలు 4, జాపత్రి కొద్దిగా, యాలకులు 3, బిర్యానీ పువ్వు కొద్దిగా, అనాస పువ్వు 1, పచ్చిమిర్చి 4 (నిలువుగా కట్ చేసుకోండి), మీడియం ఉల్లిపాయలు 3 (సన్నగా, పొడవుగా కట్ చేసుకోండి), 1 టమాట (చిన్నగా కట్ చేసుకోండి), కొత్తిమీర కొద్దిగా, పుదీనా గుప్పెడు, నెయ్యి 2 టీస్పూన్లు తీసుకోండి. (image credit - youtube - Mana Chef)
తయారీ : ముందుగా చికెన్‌ను బాగా కడిగి.. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు అర టీస్పూన్, గరం మసాలా పొడి 1 టీస్పూన్, బిర్యానీ మసాలా 1 టీస్పూన్, పెరుగు 3 టేబుల్ స్పూన్లు వేసి బాగా కలపండి. మసాలా అంతా ముక్కలకు పట్టాలి. తర్వాత అరగంటపాటూ అలా వదిలేయండి. (image credit - youtube - Mana Chef)
స్టవ్ సిమ్‌లో ఉంచి.. కుక్కర్ పెట్టి.. 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చెయ్యండి. తర్వాత సాజీర 1అర టీస్పూన్, బిర్యానీ ఆకు 1, దాల్చిన చెక్క ఒక అంగుళం, లవంగాలు 4, జాపత్రి కొద్దిగా, యాలకులు 3, బిర్యానీ పువ్వు కొద్దిగా, అనాస పువ్వు 1 నూనెలో వేసి దోరగా ఫ్రై చెయ్యండి. తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేపండి. (image credit - youtube - Mana Chef)