ఒక ఎకరం భూమిలో నల్ల మిరియాల సాగు చేపట్టవచ్చు. ప్రపంచంలోని మొత్తం మిరియాల ఉత్పత్తిలో.. 54 శాతం ఇండియా నుంచే వస్తోంది. ప్రస్తుతం మిరియాలను కేరళ, కర్ణాటక, బెంగాల్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు, కొంకణ్ ప్రాంతాల్లో పండిస్తున్నారు. మిరియాలకు ప్రపంచ దేశాల్లో చాలా డిమాండ్ ఉంది. అందుకే వాటి ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకే వాటిని నల్ల బంగారం అంటారు. ఇండియాలో 90 శాతం మిరియాలను కేరళ ఉత్పత్తి చేస్తోంది.
మిరియాల ధర ఎక్కువగా ఉండటానికి కారణం.. సాగు ఎక్కువ కాలం పట్టడమే. మిరియాల చెట్లకు పువ్వులు వచ్చిన ఆరు నెలల తర్వాత.. మిరియాలు వస్తాయి. కాబట్టి.. ఈ సాగు చేపట్టే రైతులకు సహనం ఎక్కువ. మీకు తెలుసో లేదో.. ఇండియాలో 75 రకాల మిరియాలున్నాయి. వీటిలో కరిముంద (Karimunda) జాతి.. మోస్ట్ పాపులర్. ఈ జాతి మిరియాలను కేరళలో సాగుచేస్తున్నారు.
మిరియాల పంటకు వేడి వాతావరణం అవసరం. అంటే మన తెలుగు రాష్ట్రాలు బాగా సెట్ అవుతాయి. ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. వాతావరణాన్ని బట్టీ.. ఎలాంటి మిరియాల సాగు చేపట్టాలో వ్యవసాయ అధికారులు చెబుతారు. మొక్కలకు పువ్వులు రాకముందు.. 40 రోజులపాటూ.. వాతావరణం పొడిగా ఉండాలి. అప్పుడే పూలు వస్తాయి.
ఈ చెట్లు ఇసుక, మట్టి నేల, ఎర్ర నేలల్లో పెరగగలవు. మట్టిలో ఎక్కువ రాళ్లు లేకుండా చూసుకోవాలి. మట్టిలో pH.. 5 నంచి 6.5 మధ్య ఉండాలి. 10 అడుగుల ఎత్తు పెరగగానే.. దిగుబడి వస్తుంది. ఇందుకు 6 నెలలు పడుతుంది. ఉదాహరణకు నవంబర్లో మొక్కలు నాటితే... మార్చి తర్వాత దిగుబడి వస్తుంది. చెట్లకు గుత్తులుగా కాసిన మిరియాలను చేతులతోనే సేకరిస్తారు. ఒకసారి మొక్కలు వేస్తే.. 8 ఏళ్లపాటూ వాటిని సాగు చెయ్యవచ్చు.
ఖర్చులను గమనిస్తే.. భూమిని సిద్ధం చెయ్యడానికి రూ.1000 అవుతుంది. మొక్కల కోసం రూ.5000 ఖర్చవుతుంది. ఎరువుల కోసం మరో రూ.2000, మొక్కల రక్షణ కోసం రూ.1000, నీటి పారుదల కోసం రూ.1000, కూలీల వేతనాల కోసం రూ.10,000, ఇతరత్రా ఖర్చులకు రూ.1000 అవుతుంది. ఇంకా ప్యాకింగ్ కోసం రూ.1500... ఇలా మొత్తంగా ఎకరా పొలంలో పంట కోసం రూ.25వేల దాకా ఖర్చవుతుంది.
లాభం సంగతి చూస్తే.. కేజీ మిరియాలను రైతులు రూ.400కి అమ్ముతున్నారు అనుకుంటే... 8 ఏళ్లలో 3000 కేజీల దిగుబడి వస్తుంది అనుకోవచ్చు. ఈ లెక్కన వీటి అమ్మకం ద్వారా రైతు పొందేది రూ.12 లక్షలు. ఐతే.. 8 ఏళ్లలో రైతుకు అయ్యే ఖర్చులు సుమారు రూ.75వేల దాకా ఉంటాయి. మొత్తం ఆదాయం నుంచి ఖర్చులను తీసివేస్తే.. రైతుకు మిగిలే లాభం.. రూ.11లక్షల 25వేలు. ఇదంతా ఆ రైతు 8 ఏళ్లలో ఎకరం పొలం ద్వారా సంపాదించే లాభం అవుతుంది.
కేరళ వెళ్లి.. అక్కడి రైతుల ద్వారా స్వయంగా వివరాలు తెలుసుకోవచ్చు. " width="1920" height="1256" /> ఎలాంటి మిరియాల జాతి మొక్కల్ని రైతు ఎంచుకున్నారు అనే దాన్ని బట్టీ... దిగుబడి, లాభాలు ఆధారపడి ఉంటాయి. ఈ విషయంలో రైతులు... వ్యవసాయ అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. లేదా కేరళ వెళ్లి.. అక్కడి రైతుల ద్వారా స్వయంగా వివరాలు తెలుసుకోవచ్చు.