చాలా మంది వేసుకున్న చీర కొంగుతోనో, షర్టుతోనో, కర్చీఫ్తోనో కళ్లద్దాలను తుడుస్తారు. అలా చెయ్యవద్దంటున్నారు డాక్టర్లు. స్పెట్స్ కొన్నప్పుడు వాటిని ఉంచుకునే బాక్సులో మెత్తటి క్లాత్ ఉంటుంది. దానితో మాత్రమే తుడవాలని సూచిస్తున్నారు. అది లేకపోతే... దూదిలాంటి మెత్తటి క్లాత్ (microfiber cloth) మాత్రమే వాడమంటున్నారు. లేదంటే... అద్దాలపై గీతలు పడి... పాడవుతాయని చెబుతున్నారు. (symbolic image)
కళ్లద్దాలు తుడవడం ఎంత ముఖ్యమో... ప్రేమ్స్ తుడవడమూ అంతే ముఖ్యం. ఎందుకంటే... ప్రేమ్స్కి ఉండే స్క్రూలు, స్ప్రింగ్స్, హింగెస్ వంటివి చెమట వల్ల దుమ్ముపట్టేస్తాయి. ఒకరకమైన నాచు లాంటిది అక్కడ పోగవుతుంది. వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చెయ్యకపోతే... అవి తుప్పుపట్టేస్తాయి. అలాగే... అక్కడ బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. (symbolic image)