ఈరోజుల్లో పిండి నుంచి చెక్కర వరకు మార్కెట్లో ప్రతీది కల్తీ చేయడానికి లెక్కలేనన్ని మార్గాలు కనుగొన్నారు. వంటగదిలో ముఖ్యమైన పదార్థాల్లో ఉప్పు, పంచదార కూడా కల్తీ కావచ్చు. ఎందుకంటే యూరియాను ఇప్పుడు రోజవారీ వాడే చక్కెరకు కలుపుతున్నారు. ఒక రకమైన కెమికల్ యూరియా ఎరువులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది కొద్దికొద్దిగా శరీరంలోకి ప్రవేశించి తీవ్ర హానికర ప్రభావాలను కలిగిస్తుంది.