Christmas cake : ప్లమ్ కేక్ నచ్చనివారు దాదాపు ఉండరు. క్రిస్మస్ రాగానే ఆ కేక్ తినాలని ప్లాన్ చేసుకుంటారు. భారీ ఎత్తున కేక్ పార్టీలు చేస్తారు. అంతలా ఆకట్టుకుంటున్న ఈ కేక్ వెనక పెద్ద చరిత్రే ఉంది. మధ్యయుగకాలంలో ఇంగ్లండ్‌లో.. క్రిస్మస్ వచ్చే ముందు.. ఉపవాసం చేసేవారు. ఇష్టమైన ఆహారాలను దూరం పెట్టేవారు. తద్వారా క్రిస్మస్ నాటికి ఎక్కువ తినేలా ప్లాన్ చేసుకునేవారు.
క్రిస్మస్ కేక్," width="525" height="295" /> ఆచారం ప్రకారం క్రిస్మస్ నాడు.. భారీ పొర్రిడ్జ్ (porridge) వండేవారు. దీన్ని ఓట్స్, డ్రైఫ్రూట్స్, సుగంధద్రవ్యాలు, తేనెతో తయారుచేసేవారు. దీన్ని క్రిస్మస్ తాత అని పిలిచేవారు. కాలక్రమంలో ఇదే ప్లమ్ కేక్ అయ్యింది. ఇప్పుడు ఇందులో చాలా రకాల పదార్థాలు కలుపుతున్నారు.