Home Tips : ఉద్యోగాలు చేసే చాలా మంది బయటి ఫుడ్ ఎక్కువగా తింటుంటారు. లేదా డోర్ డెలివరీ తెప్పించుకుంటారు. ఇలా ఎందుకు అంటే.. వండుకునేంత టైమ్ లేదంటారు. కానీ.. ఇంట్లో వండుకొని తింటే వచ్చే సంతృప్తి.. బయటి ఫుడ్‌తో రాదు. ఎందుకంటే.. వంట అనేది ఓ ఆర్ట్. మంచి బొమ్మ వేసినప్పుడు, బాగా వేసినప్పుడు మనం ఎంత ఆనందపడతామో.. వంట బాగా చేసినప్పుడు కూడా అంతే ఆనందపడతాం. వంట నేర్చుకునే వాళ్లు అదృష్టవంతులు. వారి ఆరోగ్యం బాగుంటుంది. మరి ఏ పప్పు ఎంతసేపు నానబెడితే.. ఆరోగ్యకరమో తెలుసుకుందాం.
ఎందుకు నానబెట్టాలి? : మినప్పప్పైనా, పెసలైనా.. ఏదైనా సరే.. నానబెట్టకుండా కూడా మిక్సీలోనో, గ్రైండర్లోనో వేస్తే మెత్తగా అవుతాయి. కానీ నీటిలో నానబెట్టినప్పుడు.. వాటిలో కొన్ని మార్పులు వస్తాయి. పోషకాలు మరింత పెరుగుతాయి. నానబెట్టిన వాటిని రుబ్బితే.. ఎక్కువ పిండి వస్తుంది. అఫ్కోర్స్ జీర్ణక్రియకు కూడా అది మేలు చేస్తుంది.
కందిపప్పు, పెసరపప్పు, శెనగపప్పు, బీన్స్, రాజ్మా, శెనగలు.. ఇలాంటి వాటిని నానబెట్టినప్పుడు.. వీటిలో ఫైటేస్ (phytase enzyme) అనే ఎంజైమ్ ఏర్పడుతుంది. దీని వల్ల మనం వాటిని తిన్నప్పుడు.. వాటిలోని పోషకాలు త్వరగా శరీరంలోకి వెళ్తాయి. అలాగే.. పప్పులను నానబెట్టినప్పుడు.. వాటిలో అమైలేస్ అనే ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియలో.. పప్పుల్లో పిండి పదార్థం లూజు అవుతుంది. అందువల్ల అవి తిన్నప్పుడు గ్యాస్, ఏసీడీటీ ఇతరత్రా కడుపులో సమస్యలు రావు. అందుకే బాగా నానబెట్టాలి.
మీరు కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు కనీసం 6 నుంచి 8 గంటలు పూర్తిగా నీటిలో నానబెట్టాలి. ఇక మినుములు, పెసల వంటి వాటిని కనీసం 8 నుంచి 12 గంటలపాటూ నానబెట్టాలి. శెనగలు, బీన్స్, రాజ్మా వంటి వాటిని 12 నుంచి 18 గంటలు నానబెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. చాలా మంది ఉదయం టిఫిన్ కోసం.. రాత్రి లేదా ముందు రోజు సాయంత్రం నానబెడతారు.
మీరు వేటిని నానబెట్టాలనుకున్నా... ముందుగా వాటిని బాగా 3 సార్లైనా కడగాలి. అలాగే నానబెట్టిన తర్వాత కూడా కనీసం 2 సార్లైనా బాగా కలుపుతూ కడగాలి. తద్వారా వాటి నుంచి రిలీజైన గ్యాస్ బయటకు పోతుంది. ఇలా కడగడం వల్ల పోషకాలు పోతాయేమో అనుకోవద్దు. పోషకాలు పప్పులతోనే ఉంటాయి. ఈ నీటిని మీరు పెరట్లో మొక్కలకు పొయ్యవచ్చు. తద్వారా నీరు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది.