స్ట్రాబెర్రీ: స్ట్రాబెర్రీ పండ్లలోని ఫ్లేవనాయిడ్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే స్టాబెర్రీస్‌ను తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. స్ట్రాబెర్రీస్‌లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, మెగ్నీషియం, అయోడిన్, ఫాస్పరస్, క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలున్నాయి. ఒక గుప్పెడు స్ట్రాబెర్రీలలో 7 గ్రాముల చక్కెర ఉంటుంది.
చెర్రీ: ఎరుపు రంగులో ఆకర్షిస్తూ, గుటుక్కుమనిపించాలనిపించే చెర్రీ పండ్లు నచ్చనిదెవరికి? నేరేడు జాతికి చెందిన ఈ పండ్లలో మంచి పోషకాలున్నాయి. మన శరీరంలో మంటలు, వాపులు, నొప్పులను తగ్గించే యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు వీటిలో ఉన్నాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధుల్ని దూరం చేస్తాయి. ఒక కప్పు చెర్రీస్‌లో 19 గ్రాముల చక్కెర ఉంటుంది.