HOW MANY EGGS DOES A HEN LAY IN A YEAR HERE THE FULL DETAILS VB
Eggs: కోడి గుడ్డుకో కథ.. కోడి తన జీవిత కాలం ఎన్ని గుడ్లు పెడుతుందో తెలుసా..!
Eggs: కరోనా వైరస్ కారణంగా మాంసం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ప్రజలు ఎక్కువగా చికెన్, మటన్, గుడ్లను తీసుకుంటున్నారు. అయితే ఒక్క కోడి నెలకు ఎన్ని గుడ్లు పెట్టగలదో ఎప్పుడైనా ఆలోచించారా.. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రస్తుతం కరోనా సమయంలో చాలామంది జాగ్రత్తలు పాటిస్తునే రోగ నిరోధక శక్తిని పెంచుకుంటున్నారు. కొంతమంది ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకుంటుంన్నారు. అలాగే ప్రతీ ఒక్కరు ఇష్టపడే మాంసం రూపంలో కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
ఆదివారం వచ్చిందంటే చాలు ఉదయం మాంసం దుకాణాల వద్ద కిక్కిరిసిపోతారు. ప్రతీ రోజు మాంసం తీసుకోకుండా కొంతమంది తమ ఆహారంలో కోడిగుడ్లను కూడా తీసుకుంటారు. గుడ్లు తినడం వల్ల మెదడు పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
అయితే ఒక్క కోడి రోజుకు ఎన్ని గుడ్లు పెడుతుందో చాలా మందికి తెలియదు. కోడి సంవత్సరానికి ఎన్ని గుడ్లను పెడుతుందో ఎప్పుడూ ఆలోచించి ఉండరు. ఈ సందేహాన్ని పరిష్కరించడానికి పౌల్ట్రీ శాస్త్రవేత్త డా. ఎయు కిడ్వాయి వివరణాత్మక సమాచారం అందించారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
అతని ప్రకారం పౌల్ట్రీ ఫామ్‌లోని కోళ్ళు సంవత్సరంలో 305 నుంచి 310 గుడ్లు పెడతాయన్నారు. అంటే పౌల్ట్రీ ఫామ్‌లోని కోడి నెలకు 25 నుంచి 26 గుడ్లు పెడుతుంది. ఈ సంఖ్య ఎక్కువ లేదా తక్కువ ఉండొచ్చన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
ఎందుకంటే పౌల్ట్రీ నడిపే వ్యక్తి కోళ్లకు పెట్టే ఆహారాన్ని బట్టి ఉంటుందన్నారు. పౌల్ట్రీ ఫామ్‌లో కోళ్ళు తినే పద్ధతి, కోళ్ళ పెంపకం చేసే పద్ధతి గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని మారుస్తాయన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
ఒక కోడి తన జీవితంలో 75-80 వారాల పాటు గుడ్లు పెట్టగలదని తెలియజేశారు. కొన్ని హైబ్రిడ్ కోళ్ళు 100 వారాల వరకు గుడ్లు పెడతాయన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
అయితే నాటుకోడి మాత్రం సంవత్సరానికి 150 నుంచి 200 గుడ్లు మాత్రమే పెడుతుందని ఆయన తెలియజేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
కరోనా కాలంలో గుడ్లు తినడం చాలా మంచిదన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)