శరీరంలో ఎక్కడో ఓ చోట చిన్న గడ్డలా మొదలవుతుంది. మెల్లమెల్లగా మిగతా భాగాలకు విస్తరిస్తుంది. నొప్పి లేకుండా మనిషిని ఊపిరితీసుకోనీయని పరిస్థితిలోకి నెట్టేస్తుంది క్యాన్సర్ గడ్డ. దీన్నే క్యాన్సర్ కణితి అంటారు. అందుకని మొదటి స్టేజ్‌లోనే క్యాన్సర్‌ని గుర్తించడం చాలాముఖ్యం. మగవాళ్ల కంటే ఆడవాళ్లలోనే ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో ముఖ్యమైనది బ్రెస్ట్ క్యాన్సర్. Photo From Unplash
చిన్న వయసులోనే పీరియడ్స్ మొదలవ్వడం, మెనోపాజ్ ఆలస్యం కావడం, 30ఏళ్ల తర్వాత పిల్లల్ని కనడం, గర్భం దాల్చకపోవడం లాంటివి బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పుని పెంచుతాయి. లావుగా ఉన్నా ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. ఇవేకాకుండా... కుటుంబంలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా కూడా ఈ క్యాన్సర్ రావచ్చు. Photo From Unplash
రొమ్ములో చిన్న గడ్డ ఏర్పడినా కూడా అది క్యాన్సర్ గడ్డ కావచ్చని భయపడుతుంటారు చాలామంది. అయితే, బ్రెస్ట్‌లో ఏర్పడే గడ్డలన్నీ క్యాన్సర్ గడ్డలు కావు. వాటిలో కాన్సర్ కణితులు కానివి కూడా ఉంటాయి. మరి... క్యాన్సర్ గడ్డల్ని ఎలా గుర్తించాలంటే.. అవి గట్టిగా ఉంటాయి. ముట్టుకున్నా కూడా నొప్పి ఉండదు. Photo From Unplash
ఇక బ్రెస్ట్ నుంచి నీళ్లలాంటి ద్రవం కారడం కూడా క్యాన్సర్ గడ్డ తాలూకూ లక్షణాలే. అంతేకాదు చనుమొనలు లోపలికి వెళ్లినట్టు ఉన్నా, బ్రెస్ట్ మీది చర్మం ఎర్రగా లేదా ఆరెంజ్ రంగులోకి మారినా, కణితి ఉన్న చోట చర్మం తెల్లని పొరలుగా లేచినట్టు కనిపిస్తున్నా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. Photo From Unplash
బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నసిస్ కోసం... మమ్మోగ్రఫీ. అల్ట్రాసౌండ్, ఎక్స్ రే తీస్తారు. ఆ తర్వాత బయాప్సీ టెస్ట్ చేస్తారు. బయాప్సీలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలిస్తే వెంటనే ట్రీట్మెంట్ మొదలుపెడతారు. అయితే అది ఏ రకమైన బ్రెస్ట్ క్యాన్సర్ అనేది తెలుసుకోవడానికి ఇమ్యునో హిస్టో కెమిస్ట్రీ టెస్ట్ చేస్తారు. Photo From Unplash
బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే.. త్వరగానే కోలుకోవచ్చు. అయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ థన్ క్యూర్ అన్నట్లు అసలు ముందు నుంచి జాగ్రత్తగా ఉంటే మంచిది. బ్యాలెన్స్డ్ డైట్ తప్పనిసరి. ఆరోగ్యకర మైన ఫుడ్ తినడమే కాకుండా బరువు పెరగ కుండా చూసుకోవాలి. సీజనల్‌గా దొరికే పండ్లు, కూరగాయలు ఎక్కువ తినాలి. వీటిలో ప్రిజర్వేటివ్స్ తక్కువ కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచివి. Photo From Unplash