మీకు వాము తెలుసుగా.. జీలకర్ర లాగా ఉంటుంది. మన ఆయుర్వేదంలో వామును చాలా ఎక్కువగా వాడుతారు. ఈ వాము మొక్కల్ని నర్సరీల్లో అమ్ముతారు. ఇవి చాలా అందంగా ఉంటాయి. వాము ఆకులు మందంగా ఉంటాయి. ఈ మొక్కకు నీరు ఎక్కువ అక్కర్లేదు. మొక్కలోని ఓ కాడను తెంపి.. భూమిలో పెడితే.. మరో మొక్క వచ్చేస్తుంది. ఇలా ఎన్ని మొక్కలైనా రాగలవు.
Weight loss : వాము ఆకుల్లో కేలరీలు తక్కువ. ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా శరీరంలో చెడు కొవ్వు కరిగిపోతుంది. ఈ ఆకులు బరువు పెరగకుండా చేస్తాయి. అదువల్ల ఆరోగ్యం అన్ని రకాలుగా మెరుగవుతుంది. ఫలితంగా ఎక్కువ కాలం జీవించేందుకు వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు.