ఇండియాలో కాఫీ వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. అంతర్జాతీయ కంపెనీలు... రకరకాల కాఫీలను ఇండియన్స్‌కి అలవాటు చేస్తున్నాయి. ఐతే... చాలా మంది ఇళ్లలో కాఫీ పెట్టుకొని... ఫిల్టర్ చేస్తారు. ఆ తర్వాత ఆ పొడిని పారేయడమో, మొక్కలకు వేయడమో చేస్తారు. ఐతే... ఆ పొడిని పారేయకుండా 7 రకాలుగా వాడుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.
Repelling insects: కాఫీ వాసన మనుషులకు నచ్చుతుంది గానీ… క్రిమి కీటకాలకు నచ్చదు. మీ ఇంట్లో ఎక్కడ పురుగులు, కీటగాలు, బొద్దింకల వంటివి ఉంటాయో… అక్కడ కాఫీ పొడిని ఉంచండి. “మన సీక్రెట్ వీళ్లకు తెలిసిపోయింది. ఇక మన ఆటలు సాగవు. పదండి పోదాం” అని అనుకుంటూ అవి మరో ఇల్లు చూసుకుంటాయి. దోమలు కూడా పోతాయి. ఇందుకోసం కాఫీ పొడిని కాల్చాల్సి ఉంటుంది. ఆ పొగను దోమలు భరించలేవు. ఈ పని చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి.
Treating Puffy Eyes: నిద్ర సరిపోవట్లేదా… కళ్లు ఉబ్బినట్లు అయ్యిందా… అయితే మీరు కాఫీ పొడిని ఇలా వాడొచ్చు. కాఫీ పొడికి నీరు లేదా ఆలివ్ ఆయిల్ కలపాలి. ఆ పొడిని మీ కళ్ల కింద ఉన్న నల్లటి గీతలపై రాసుకోవాలి. కాఫీ పొడిలోని కెఫైన్… రక్త సరఫరాను వేగవంతం చేస్తుంది. పావు గంట తర్వాత ముఖం కడిగేసుకోండి. మీ కళ్లు కాంతివంతం అవుతాయి. నల్లటి చారలు పోతాయి.