HOME REMEDIES TO DESTROY INSECTS LIKE ANTS LIZARDS FLIES COCKROACHES AND MOSQUITOES AT HOME IN MONSOON SK
Home Tips: వానాకాలంలో ఇంట్లో క్రిమి కీటకాలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా చేస్తే అన్నీ పరార్..
Home Remedies Keep Away Insects In Rainy Season: వర్షాకాలం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉటుంది. ఈ కూల్ కూల్ వెదర్నుచాలా మంది ఆస్వాదిస్తారు. కానీ ఇదే వర్షాకాలం ఎన్నో వ్యాధులను తీసుకొస్తుంది.ఈ కాలంలో ఇంట్లోకి చీమలు, బొద్దింకలు, ఈగలు, చెదలు ఎక్కువగా వస్తాయి. ఇవి వివిధ వ్యాధులకు కారణమవుతాయి.
Home Remedies Keep Away Insects In Rainy Season: వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోకి వచ్చే క్రిమి కీటకాల వలన అనేక రకాల వ్యాధులు వస్తాయి. అందుకే ఎలాంటి హానికాకర రసాయనాలు లేకుండా కేవలం ఇంట్లో ఉండే వస్తువులతో క్రిమి కీటకాలను ఎలా తరిమికొట్టాలో ఇక్కడ తెలుసుకుందాం.
2/ 6
ఈగలు, దోమల అనారోగ్యాలను తెస్తాయి. వీటిని వెళ్లగొట్టేందుకు ఒక ఉల్లిగడ్డపై సాంబ్రాణి నూనె రాసి గదిలో ఓ చోట వేలాడదీయాలి. వేపాకు, సాంబ్రాణి, కర్పూరం మండిస్తే పొగ వస్తుంది. ఆ పొగకు ఈగలు,దోమలు పారిపోతాయి.
3/ 6
ఇంట్లో ఉండే చెక్క సామాగ్రిని వర్షా కాలంలో చెదలు పాడు చేస్తాయి. అవి ఇంట్లోకి వచ్చాయంటే పుస్తకాలు, బట్టలు కూడా నాశనం అవుతాయి. ఒకవేళ ఇంట్లో ఎక్కడైనా చెదలు కనిపిస్తే ఆ ప్రాంతంలో గుప్పెడు వేపాకులు ఉంచాలి. చెదల మందును సిరంజిలో నింపి చెదలు ఉన్న చోట ఉంచాలి.
4/ 6
గోడలపై పాకే బల్లులను చూస్తే చాలా మందికి భయం వేస్తుంది. మీద పడతాయేమోనని ఆందోళన చెందుతుంటారు. బల్లులు తిరిగే చోట్ల గుడ్డు పెంకులను ఉంచాలి. ఉల్లిగడ్డ, వెల్లుల్లి వాసనకూ బల్లలు పారిపోతాయి.
5/ 6
ఇంట్లో వాష్ బేసిన్లు, సింకులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే మంచింది. ఇంట్లో నీరు బయటకు వెళ్లే చోట ఫినైల్ టాబ్లెట్లను ఉంచాలి. ఇలా చేస్తే ఇంట్లో బొద్దింకల బెడద తగ్గుతుంది.
6/ 6
తినే పదార్థాలను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు. కిచెన్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే చీమలు ఎక్కువగా వస్తాయి. చీమలు ఎక్కువగా ఉన్న చోట్ల పసుపు, బోరాక్స్ పొడి కలిపి ఆ మిశ్రమాన్ని చల్లాలి. గోడలకు ఎక్కడైనా రంధ్రాలు ఉంటే సిమెంట్‌తో పూడ్చివేయాలి. (Image/Pixabay)