Holi celebrations 2021: పండుగలు మనకు కావాల్సినప్పుడు రావు. అవి వచ్చినప్పుడే మనం వాటిని జరుపుకోవాలి. ముఖ్యంగా హోలీ అనేది రంగుల పండుగ. ఈ పండుగ నాడు మనం ఎవరికి రంగు పూసినా, మనకు ఎవరు రంగు రాసినా... అది మనకు జీవితాంతం గుర్తుండిపోతుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో జరుపుకునే పండుగ ఎన్నో మధురాను భూతులను మిగుల్చుతుంది. మీరు మీ ప్రియమైనవారితో ఉన్నప్పుడు పండుగ ఆనందం రెట్టింపు అవుతుంది. అందుకే దీన్ని కుటుంబంతో జరుపుకోవాలి అంటుంటారు. పండుగ పుణ్యమా అని అందరం దగ్గరవుతాం, ప్రేమ పెరుగుతుంది.
కుటుంబ సభ్యులు అందరూ ఒకే ఊరిలో ఉంటే... అందరూ హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు వీలవుతుంది. కొన్ని సందర్భాల్లో ఉద్యోగాల వల్లో ఇతర కారణాల వల్లో... కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు హోలీ వేడుకల్లో పాల్గొనలేకపోతున్నానే అనే బాధ ఉంటుంది. అలాంటి వారు ఆ ఒంటరి తనాన్ని గుర్తు చేసుకుంటూ నిరాశతో ఉండాల్సిన పని లేదు. కొన్ని చర్యల ద్వారా... హోలీని ఆస్వాదించవచ్చు.
మీరు కుటుంబానికి దూరంగా ఉంటే హోలీ పిల్లలతో సరదాగా ఉంటుంది. కాబట్టి హోలీని ఒంటరిగా జరుపుకోవలసిన అవసరం లేదు. మీ చుట్టూ ఉన్న చిన్న పిల్లలతో సమావేశమై మీరు ఈ హోలీని ఆస్వాదించవచ్చు. ఈ హోలీ మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలను తిరిగి గుర్తుకు తెస్తుంది. ఒంటరితనం నుంచి మిమ్మల్ని బయటకు తెస్తుంది. పిల్లలకు రంగులు పూయండి... వారితో పూయించుకోండి. వారితో పాడండి, ఆడండి... తద్వారా హోలీని ఆనందించండి. కరోనా జాగ్రత్తలన్నీ పాటించండి.
ఒక్కోసారి స్నేహితులు దగ్గర్లో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మీ ఆఫీసులో సహోద్యోగులను మీ ఇంటికి ఆహ్వానించండి. వారితో కలిసి హోలీ వేడుకలు జరుపుకోండి. మీ చుట్టూ ఉన్న వారిని కూడా ఇంటికి పిలవవచ్చు. వారితో చాట్ చేసి రుచికరమైన స్వీట్లు, స్నాక్స్ వంటివి తినండి. ఇది మీ సహోద్యోగులతో మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. పండుగ హాయిగా సాగుతుంది.
హాస్టల్లో ఉండే వారు కూడా తమ తోటి వారితో పండుగ జరుపుకోవచ్చు. కరోనా వైరస్ వ్యాపిస్తోంది కాబట్టి... కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ... హోలీ జరుపుకోవచ్చు. మాస్క్ ధరిస్తూ... శానిటైజర్ వాడుతూ... సేఫ్ డిస్టాన్స్ మెయింటేన్ చేస్తూ... ప్రభుత్వాల ఆంక్షలు పాటిస్తూ హోలీ జరుపుకుంటే... ఏ సమస్యా ఉండదు. రెండ్రోజులు పోయాక మీరు కలర్ రాసినా ఎవరూ ఒప్పుకోరు. అలాంటి ఛాన్స్ ఇవాళ మిస్ కాకుండా చూసుకోండి.