Chicken Recipe: జీడిపప్పు.. ప్రస్తుతం ఈ పదం చాలా మందికి తెలుసు. ఎందుకంటే.. కరోనా మహమ్మారి కారణంగా చాలావరకు తమ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడానికి డ్రై ప్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకున్నారు. దాని వల్ల జడిపప్పు అనేది రేటు ఎక్కువ అయినా.. చాలామంది కొనుక్కొని తిన్నారు. అయితే ఇది శరీరంలో రోగనిరోధశక్తిని పెంచడమే కాకుండా.. దీని ద్వారా చికెన్ కూడా చేసుకోవచ్చు. ఆ రుచి ఎలా ఉంటుందంటే.. తింటే ఇంకోసారి తినాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. (image credit - youtube)
ఈ చికెన్ పేరు.. కాజు చికెన్ మసాలా. మనం మామూలుగా చికెన్ కోసం ఏ పదర్థాలను తీసుకుంటామో.. అలానే వీటికి కూడా అదే పదర్థాలను తీసుకోవాలి. ప్రతీ ఆదివారం చికెన్ వండుకొని బోరు కొట్టినవాళ్లు.. ఈ సారి ఇలా ట్రై చేయండి. కొత్తగా ఉంటుంది.. మంచి మాధుర్యాన్ని కూడా ఆస్వాదిస్తారు. ఇది చపాతి, పూరీ తినే సమయంలో కర్ర ప్లేస్ లో దీనిని అద్దుకొని తినవచ్చు. ఒక్కసారి ఆ రుచి చూస్తే.. మళ్లీ చేసుకోవాలనే ఆలోచన వస్తుంది. (image credit - youtube)
దీనికి కావాల్సిన పదర్థాల విషయానికి వస్తే.. చికెన్ అరకేజీ, మసాలాలోకి కావాల్సినవి.... యాలకులు 4, జీడిపప్పు బద్దలు 20, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు 4, మిరియాలు 15, ధనియాలు ఓ టేబుల్ స్పూన్, జీలకర్ర ఓ టీ స్పూన్, కారం ఓ టేబుల్ స్పూన్, వంటకోసం నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర అర టీస్పూన్, 2 ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకోవాలి, 4 పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకోవాలి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కొద్దిగా, గరం మసాలా 1 టీస్పూన్, కొత్తిమీర కొద్దిగా. (image credit - youtube)
ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వెయ్యాలి. తర్వాత కొద్దిసేపు వేపాలి. తర్వాత ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక... ఓ టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వెయ్యాలి. చిటికెడు పసుపు వెయ్యాలి. ఇలా ఉంచి నిమిషం పాటూ వేడి చెయ్యాలి. ఇప్పుడు అందులో మాంసం ముక్కులు వేయాలి. (image credit - youtube)
ఇక అందులో చివరకు జీడిపప్పు మసాలా పేస్టును వేయాలి. 15 నిమిషాల పాటు గ్యాస్ ను సిమ్ లో పెట్టి అలాగే ఉడికించాలి. అందులో కాస్త గరం మసాలా వేయాలి. చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత కొత్తిమీర ఉంటే అందుల వేసుకోవచ్చు. అంతే ఇక జీడిపప్పు చికెన్ అయిపోయినట్లే.. ఈ వీడియో చూడాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేసి చూడొచ్చు https://youtu.be/yXyxuGdHzPE. (image credit - youtube)