మలబద్దకంతో బాధపడేవారికి తమలపాకు చక్కటి ఔషదంలా పనిచేస్తుంది. మలబద్దకం సమస్య ఉన్న వారు భోజనం చేసిన తర్వాత తమలపాకును తింటే ఈ సమస్యనుంచి బయటపడతారు. అలాగే ఒక గ్లాసు నీళ్లను తీసుకుని అందులో తమలపాకును చిన్న చిన్నముక్కలుగా చేసి వేయాలి. వాటిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయం పరిగడుపున తాగాలి. క్రమం తప్పకుండా ఈ చిట్కాలను పాటిస్తే మీ సమస్యలన్నీ మటుమాయం అవుతాయి.