* ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం : ఇప్పుడు వర్క్ ఫ్రం హోం చాలామందికి కామన్ అయింది. ఇదే సమయంలో వర్క్ స్ట్రెస్ కూడా పెరుగుతోంది. అదీ కాక గాడ్జెట్స్ వినియోగం పెరగడంతో ఎక్కువసేపు ఎలక్ట్రానిక్ డివైజ్ల ముందు కూర్చోవాల్సి వస్తోంది. ఆరు గంటల కంటే ఎక్కువ సమయం వీటి ముందు మీరు గడుపుతుంటే.. మీరు ఫాస్ట్ ఏజింగ్ ప్రమాదంలో ఉన్నట్లే.
* సన్ స్క్రీన్లు వాడాల్సిందే : కొందరు చాలా ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. పైగా సన్ స్క్రీన్ (Sun Screen) లోషన్లు వాడటానికీ శ్రద్ధ చూపించరు. ఇది చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇలాంటి వారిలో తొందరగా ముఖంపై ముడతలు ఏర్పడతాయి. ఈ తప్పులు చేసేవారిలో ఎనిమిది శాతం తొందరగా వృద్ధాప్య సూచనలు కనిపిస్తాయి.
* మద్యం, సిగరెట్లు : రోజూ ఆల్కహాల్ తాగేవారిలో వృద్ధాప్యం వేగంగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది వివిధ అవయవాల పనితీరుపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. పొగతాగడం వల్ల కూడా అంతర్గత అవయవాలు దెబ్బతిని, ఆ ప్రభావం చర్మంపై పడుతుంది. ఫలితంగా వృద్ధాప్య ఛాయలు వయసుతో పాటు వచ్చే సమయానికంటే ముందే వచ్చేస్తాయి. అందుకే ఈ రెండింటినీ దూరం పెట్టడం మంచిది.
* ఎలా నిద్రపోతున్నారనేది ముఖ్యం : చాలా మందికి స్లీపింగ్ పొజిషన్ (Sleeping Positions)లపై పెద్దగా అవగాహన ఉండదు. అయితే అవి మన ఆరోగ్యంపై ఎంతగానో ప్రభావం చూపిస్తాయి. ఎక్కువగా పక్కకు తిరిగి పడుకునే వారిలో ముఖంపై ఒత్తిడి అధికంగా ఉంటుంది. రోజూ అలాగే పడుకోవడం వల్ల ముఖంపై ముడతలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖంపై ఒత్తిడి పడకుండా ఉండే స్లీపింగ్ పొజిషన్స్ని ఎంచుకోవాలి.
* అన్ హెల్దీ డైట్ : కృత్రిమ చక్కెరలు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల త్వరగా వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తాయి. అందుకే వీటి వాడకాన్ని తగ్గించుకోవాలి. కుదరకపోతే మితంగా తినడం అలవాటు చేసుకోవాలి. అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడం వల్ల మన శరీరంపై ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయి. అందుకే హెల్తీ డైట్ ఫాలో అవ్వాలి.