ఇంట్లో ఏది లేకున్నా.. ఉప్పు మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. భారత వంటకాల్లో తప్పనిసరిగా ఉండే పదార్థం ఉప్పు. వివిధ రకాల ఆహార పదార్థాల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. అసలు ఉప్పు లేని వంటే ఉండదంటే అతిశయోక్తి కాదు. వంటకాలకు ఉప్పు మంచి రుచిని తీసుకొస్తుంది. ఇది పడకపోతే.. ఎంతటి ఖరీదైన ఆహార పదార్థాలైనా చప్పగా ఉంటాయి. మన అస్సం తినలేం.
ముందు ఒక బంగాళాదుంపను తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకోండి. కత్తిరించిన వైపు దుంప ముక్కలపై కొంచెం ఉప్పు వేయండి. ఒక నిమిషం తరువాత, ఆ బంగాళాదుంప ముక్కలపై రెండు చుక్కల నిమ్మరసం వేయండి. బంగాళాదుంప రంగు మారకపోతే, మీరు వాడే అయోడైజ్డ్ ఉప్పు కల్తీ కాలేదని గుర్తించాలి. ఒకవేళ మీరు వాడేది కల్తీ అయోడైజ్డ్ ఉప్పు అయితే, బంగాళాదుంప నీలం రంగులోకి మారుతుంది.