* ఇలా తీసుకోండి.. : శీతాకాలం పసుపు వేసి మరిగించిన పాలు (Turmeric Milk) రోజూ తాగితే శరీరం వెచ్చగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కొబ్బరి నూనె, నల్ల మిరియాలు, పసుపు కలిపి తీసుకుంటే అది ఒంటికి బాగా పడుతుంది. ఉదయాన్నే రెగ్యులర్ టీకి బదులు టర్మరిక్ టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
* సైనస్‌కు చెక్ : పసుపును ఆహారంలో తీసుకుంటే సైనస్ లక్షణాలు తగ్గుతాయి. ఫుడ్, డ్రింక్స్‌లో మాత్రమే కాకుండా.. దీన్ని సూప్, కూరలు, స్మూతీస్‌లలో యాడ్ చేసుకోవచ్చు. లేదా కాల్చిన కూరగాయలపై కూడా చల్లుకోవచ్చు. పసుపు పొడిని కొద్దిగా నీటితో కలిపి పసుపు పేస్ట్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. దానిని మసాలాగా ఉపయోగించవచ్చు. ఇలా ఎన్నో విధాలుగా పసుపును ఆహారంలో భాగం చేసుకుని బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.