మందులతో పనిలేకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలని చాలా మంది కోరుకుంటున్నారు. తద్వారా కరోనా సహా వెయ్యికి పైగా రకాల వైరస్లను ఎదుర్కోవాలనుకుంటున్నారు. ఇండియాలో ఆల్రెడీ సెకండ్ వేవ్ ఉంది. నవంబర్లో థర్డ్ వేవ్ వస్తుంది అంటున్నారు. అందువల్ల మనం సరైన ఆహారం తినాలి. మన వ్యాధినిరోధక శక్తిని పెంచుకుంటే... ఇక మందులతో పని ఉండదు.
మన శరీరానికి విటమిన్ సీ బాగా అందితే... అది కణాలకు బలం ఇస్తుంది. అప్పుడు వైరస్ కణం దగ్గరకు వచ్చినప్పుడు కణం దానికి లొంగదు. కణం లొంగకపోతే... వైరస్ ఓడిపోతుంది. చనిపోతుంది. కాబట్టే మనం సీ విటమిన్ ఉండే ఆహారం ఎక్కువ తీసుకుంటున్నాం. ఇదే పనిని జింక్ కూడా చేస్తుంది. ఇలాంటి వైరస్లు వచ్చినప్పుడు వాటిని చచ్చిపోయేలా చెయ్యడంలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. జింక్ కోసం మనం జింక్ టాబ్లెట్లు వాడుతుంటాం. ఈ టాబ్లెట్ల వల్ల సైడ్ ఎఫెక్టులు ఉంటాయి. వాటి బదులు జింక్ ఉండే ఆహారం తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. జిక్... మన చర్మం, పాంక్రియాస్, లివర్, కిడ్నీలకు మేలు చేస్తుంది.
డి విటమిన్ లాగా జింక్ అనేది ఎండలో లభించదు. అందుకే చాలా మందికి జింక్ లోపం ఉంటుంది. జింక్ కావాలంటే మనం ఆహారం తినాల్సిందే. జింక్ సరిపడా లేకపోతే... డయేరియా (అతి మూత్రం) సమస్య వస్తుంది. మనిషి ఎదుగుదల ఆగిపోతుంది, జుట్టు రాలుతుంది, కళ్లు, చర్మం దెబ్బతింటాయి. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. రోజూ మగవాళ్లకు 11 మిల్లీగ్రాములు, ఆడవారికి 8 మిల్లీగ్రాముల జింక్ అవసరం. మాంసాల్లో జింక్ ఉంటుంది. కానీ శాఖాహారులు జింక్ కోసం కొన్ని రకాల ఆహారాలు తీసుకోవచ్చు.
Pumpkin seeds: గుమ్మడికాయ గింజల్లో కూడా జింక్ ఉంది. 28 గ్రాముల గుమ్మడికాయ గింజల్లో 2.2 మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది. అలాగే ప్రోటీన్స్ 8.5 మిల్లీగ్రాములు ఉంటాయి. గుమ్మడికాయ గింజల్ని తరచూ తింటూ ఉంటే... కేన్సర్ తగ్గే అవకాశాలు ఉంటాయని పరిశోధన తెలిపింది. జింక్ లోపం ఉన్నవారు... రోజూ గుప్పెడు గుమ్మడికాయ గింజలు తినాలి.
Hemp seeds: జనపనార విత్తనాల్లో కూడా పోషకాలు ఎక్కువే. ఇందులో కరిగిపోని కొవ్వు, జింక్ ఉంటాయి. 1 టేబుల్ స్పూన్ జనపనార గింజల్లో 1 మిల్లీ గ్రామ్ జింక్ ఉంటుంది. ఈ గింజల్లో శరీరానికి అవసరమైన అమైనో యాసిడ్లు కూడా లభిస్తాయి. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. పెరుగు, సలాడ్లలో ఈ గింజలు చల్లుకొని తినవచ్చు.