తినే ఆహారాన్ని బట్టి ఆరోగ్యం ఉంటుందనే నానుడి అందరూ వినే ఉంటారు. ప్రతి ఆహార పదార్థం కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. మనం తినే ఆహారం మెదడు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మెదుడు ఆరోగ్యంగా ఉంటే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. పనులపై ఎక్కువ శ్రద్ధ చూపగలం. గుడ్ డైట్ అనేది బ్రెయిన్ ఫంక్షన్‌ను స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు బ్రెయిన్ ఫంక్షన్‌కు మేలు చేసే సూపర్‌ఫుడ్‌ల గురించి పరిశీలిద్దాం.
* బ్రకోలి(Broccoli) : బ్రకోలి కూరగాయ జాతికి చెందుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మతిమరుపు ఉన్నవారు ఈ కూర తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. దెబ్బతిన్న నాడీ కణాలను పదునుపెట్టడం, పునర్నిర్మించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. ఈ ఆకుపచ్చ కూరగాయలో మెదడు కణజాల పెరుగుదల, మరమ్మత్తును ప్రోత్సహించే సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది.
* బ్లూ బెర్రీస్ : బ్లూ బెర్రీస్ చాలా రుచికరంగా ఉంటాయి. రోజూ తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే నష్టం నుంచి మెదడును రక్షించడంలో బ్లూబెర్రీస్ కీలకంగా వ్యవహరిస్తాయి. అల్జీమర్స్ లేదా డెమెన్షియా వంటి వ్యాధుల రిస్క్ తక్కువగా ఉంటుంది. బ్లూబెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి మెదడు వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో అమోఘంగా పనిచేస్తాయి.
* డార్క్ చాక్లెట్ : డార్క్ చాక్లెట్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ కొన్ని డార్క్ చాక్లెట్స్ తీసుకుంటే ఒత్తిడిని తగ్గించే ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. అంతేకాకుండా మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచే ప్రత్యేక కాంపౌండ్స్, ఫ్లేవనాయిడ్స్ కూడా ఇందులో ఉంటాయి. జ్ఞాపకశక్తిని పెంచడంలో ఇవి మరింత కీలకంగా వ్యవహరిస్తాయి. డార్క్ చాక్లెట్లో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆందోళన, నిరాశను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి.
* గుడ్లు : అందరికీ అందుబాటులో ఉంటే పోషక వనరులు గుడ్లు. గుడ్లలో బి విటమిన్, కోలిన్ అనే పోషకం పుష్కలంగా ఉంటాయి. బి-విటమిన్ మెదడులోని లోపాలను తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. జ్ఞాపకశక్తికి బాధ్యత వహించే న్యూరోట్రాన్స్ మీటర్లను సృష్టించడానికి శరీరం కోలిన్‌ను ఉపయోగిస్తుంది. కాబట్టి రోజుకో గుడ్డు తినడం మంచిది.