ఒక వ్యక్తిపై ఏర్పడే తెలియని మోహం, ఇష్టం, ప్రేమలను క్రష్ లేదా టెంపరరీ ఇన్ఫ్యాచుయేషన్ అంటారు. క్రష్ అనేది ఆడవాళ్లకు మగవాళ్లపైన లేదా మగవాళ్లకు ఆడవాళ్ల మీద కలిగే తాత్కాలికమైన, బలమైన భావన. క్రష్‌గా ఊహించుకునే వ్యక్తి కలల్లో కనిపించడం సాధారణ విషయం. వారితో సన్నిహితంగా ఉన్నట్లు, ఇద్దరూ పెళ్లి చేసుకున్నట్టు, యాత్రలకు వెళ్లినట్లు కలలు వస్తుంటాయి. వీటివల్ల కొంతసేపు ఉత్తేజం కలుగుతుంది. ఇలాంటి కలలన్నీ నిజం కావాలని అందరూ కోరుకుంటారు. కాన్నిసార్లు క్రష్‌కు ఏదో ప్రమాదం జరిగినట్టు, వారు ఏదో ఆపదలో ఉన్నట్టు కూడా కలలు వస్తుంటాయి. క్రష్‌పై కలల వెనుక అంతరార్థం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అసలు మనకు క్రష్ గురించి ఎలాంటి కలలు వస్తాయి, వాటి అర్థం ఏంటో చూద్దాం.