రిలేషన్షిప్ (Relationship)లో ఉండే ప్రతి ఒక్కరూ తమ భాగస్వామి గురించి ఎన్నో ఊహించుకుంటారు. వారు ప్రతి విషయంలో తోడు, నీడగా ఉండాలని ఆశిస్తారు. ఇదే సమయంలో.. అసలు ఆ పర్సన్ మీకు సరైన వ్యక్తేనా అని ఏదో ఒక సందర్భంలో మనసులో ఆలోచన పుట్టుకువస్తుంది. అయితే ఈ పరిస్థితికి కొన్ని ప్రత్యేక కారణాలు దోహదం చేయవచ్చు.
గతంలో ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు, మనస్పర్థలు, ఎదుటి వారిపై నమ్మకం కోల్పోవడం.. ఇలాంటి కారణాలు ఎన్నో ఉండవచ్చు. అయితే ఇద్దరి మధ్య సరైన కనెక్షన్ ఉంటేనే రిలేషన్షిప్లో ముందడుగు పడుతుంది. లేదంటే విడిపోవాలనే ఆలోచనలు వస్తుంటాయి. మీరు సరైన వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నారో లేదో తెలిపే సంకేతాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.
* మీ సక్సెస్‌ను మెచ్చుకుంటున్నారా? : మీరు కెరీర్లో ఒక అడుగు ముందుకేసినప్పుడు లేదా జీవిత లక్ష్యాలను చేరుకోవడంలో సక్సెస్ అయినప్పుడు.. మీ పార్ట్నర్ మిమ్మల్ని అభినందిస్తున్నారో లేదో చెక్ చేయండి. ఎందుకంటే పర్ఫెక్ట్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీ విజయాన్ని పార్ట్నర్ సొంత విజయంలా భావిస్తారు. మీ పార్ట్నర్ కూడా మీ సక్సెస్ పట్ల నిజంగా ఆనందంగా, ఉత్సాహంగా ఉంటే.. మీరు సరైన వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నారని అర్థం.
* మీకు సపోర్ట్ చేస్తున్నారా? : ఎవరైనా మీ వెనుక ఉన్నారని బలంగా నమ్మితే.. జీవితంలో ఏ విషయంలోనైనా వారు మీ వెంట వస్తారు. సరైన రిలేషన్‌షిప్‌కు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. పార్ట్నర్స్ ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, అన్ని విషయాల్లో తోడున్నట్లు భరోసా ఇవ్వగలిగితేనే వారి బంధం మరింత ముందుకెళ్తుంది. అలా కాకుండా గ్రాంటెడ్‌గా తీసుకుంటూ మిమ్మల్ని సపోర్ట్, కేర్ చేయకుండా.. ప్రతి విషయంలో నెగిటివిటీని బయటకు తీస్తుంటే.. ఆ వ్యక్తితో రిలేషన్షిప్ సరైనది కాకపోవచ్చని గుర్తించాలి.