పచ్చిబఠాణీలు ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మనకి ఎక్కువగా ఆకలి అనిపించదు. పచ్చిబఠాణీలను ఉడకబెట్టికొని మాత్రమే కాకుండా అనేక రకాలుగా కూరలు, సూప్ చేసుకొని తినటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సన్నగా నాజుగ్గా కనపడాలనుకునే వారు బఠాణీలను ఎక్కువగా తీసుకుంటే మంచిది. మలబద్దకంతో బాధపడేవారు పచ్చి బఠానీలను ఆకుకూరలు, కూరగాయలతో కలిపి తీసుకుంటే విరేచనం సాఫీగా జరిగి మలబద్దకం నుండి విముక్తి పొందవచ్చు.