ఈ రోజుల్లో నెయ్యి వాడకం బాగా పెరిగింది. ఎందుకంటే... దాని వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు బాగా తెలుస్తున్నాయి. నెయ్యి మనం తినే పదార్థాలకు రుచిని ఇవ్వడమే కాదు. శరీరంలోకి వెళ్లాక... చాలా మంచి పనులు చేస్తుంది. అసలు మన దేశంలో శతాబ్దాలుగా నెయ్యి వాడకం ఉంది. విదేశీయులకు నెయ్యిని పరిచయం చేసిందే మనం. (Photo: Collected)
మొదట్లో విదేశీయులు... నెయ్యిని చూసి... ఏంటి ఇది ఇలా ఉంది అని వింతగా ముఖం పెట్టేవారు. తర్వాత వాసన చూసి... భలే ఉందే అనుకున్నారు. ఆహారంలో వేడి వేడి నెయ్యి వేసుకుని తిన్నాక... వాళ్లకు లైట్ వెలిగింది. అమ్మా... ఇండియన్స్ ఇంత మంచి టేస్టీ పుడ్ వాడుతున్నారా అని అనుకొని... క్రమంగా వాళ్లూ వాడటం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడైతే... విదేశీయులు నెయ్యి తెగ వాడుతున్నారు. ఎందుకంటే దానితో ఆరోగ్య ప్రయోజనాలపై వాళ్లకు మనకంటే ఎక్కువగా అవగాహన కలిగేసింది. నెయ్యి వల్ల కొవ్వు బాడీ అవుతుందేమో అనే డౌట్ ఉండొచ్చు. అలా జరగదు. నెయ్యి మనకు అవసరమైన మంచి కొవ్వును బాడీకి ఇస్తుంది. (Collected photos)
నెయ్యి మనలో ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇందులో కొవ్వులో కరిగే విటమిన్లు D, K, E, A ఉంటాయి. ఇవి మన శరీరంలో రకరకాల పనులు చేస్తూ... వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. మనం తినే ఆహారంలో... కొవ్వులో కరిగే విటమిన్లను నెయ్యి గుర్తించి... లాగి... అట్టి పెడుతుంది. అవి వ్యాధిని తెచ్చే వైరస్లతో పోరాడుతాయి. (Photo: Collected)
మల బద్ధకం సమస్య ఉన్నవారు... ఆయుర్వేద టాబ్లెట్లు అవీ ఇవీ అని ఏవేవో వాడి ఆరోగ్యం పాడుచేసుకోవద్దు. సింపుల్గా రోజూ మూడు పూటలా కాస్తంత నెయ్యి వాడండి. అది మూత్ర నాళాలను బలంగా చేస్తుంది. పేగుల్లో సమస్యలను తరిమేసి... మూత్రం ఈజీగా అయ్యేలా చేస్తుంది. ఈ తేడాను మీరు చాలా త్వరగానే గుర్తించగలరని డాక్టర్లు చెబుతున్నారు. (Photo: Collected)
పరీక్షల సమయంలో పిల్లలు తెగ చదువుతుంటే... బుర్ర హీటెక్కిపోవడం ఖాయం. అందుకే వాళ్లకు నెయ్యితో కూడిన ఆహారం పెట్టాలి. నెయ్యిలోని శాచురేటెట్ ఫాట్స్... బాగా ఆలోచించేలా చేస్తాయి. కణాలు, కణజాలాలూ నాశనం కాకుండా కాపాడతాయి. ఉదయాన్నే ఏమీ తినకుండా ఓ స్పూన్ నెయ్యి తాగితే... కొత్త కణాలు డెవలప్ అవుతాయి. అంటే తెల్లారే మన బాడీ... మృతకణాల్ని తరిమేసి... కొత్త కణాలు వచ్చేలా నెయ్యి చేస్తుంది. (Photo: Collected)
నా గుండె హాయిగా ఉంది... నా గుండెకు ఏమీ కాదు అని మీరు గుండెపై చెయ్యి వేసి చెప్పుకోవాలనుకుంటే... మీరు నెయ్యి వాడాలి. నెయ్యి మీ కంటి చూపును కాంతివంతంగా చేస్తుంది. కాన్సర్ అంతు చూస్తుంది. ఓవరాల్గా ఆరోగ్యాన్ని పెంచుతుంది. (File photo) (Disclaimer: The information provided in this article is based on general information. telugu News18 Digital does not confirm these. Please contact the relevant experts before implementing it.)