శరీరంలో ఇంత ముఖ్యమైన పాత్రను పేగులు నిర్వర్తిస్తున్నాయి కాబట్టే.. వీటికి మన ఆరోగ్యంలో ప్రధాన పాత్ర ఉందని చెబుతున్నారు. నిజానికి తినే ఆహార పదార్థాలు, లైఫ్ స్టైల్ వల్ల శరీరంలో ఎక్కువగా ప్రభావితం అయ్యేవి పేగులే. కానీ వీటిని జాగ్రత్తగా చూసుకోవడంపై ఎక్కువ మంది అశ్రద్ధ వహిస్తారు. అందుకే పేగుల ఆరోగ్యం(Gut Health) కాపాడుకోవడానికి ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
* పేగుల ఆరోగ్యానికి ఐదు మార్గాలు : పేగులను ఆరోగ్యంగా ఉంచడానికి ఏం చేయాలనే దానిపై ఎక్కువ మందికి అవగాహన ఉండకపోవచ్చు. దీనిపై ఓ ప్రముఖ న్యూట్రిషనిస్ట్ సోషల్ మీడియాలో కొన్ని టిప్స్ షేర్ చేశారు. పొత్తి కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, చర్మం ఆరోగ్యం సరిగా లేకపోవడంలాంటి లక్షణాలు పేగు అనారోగ్యాన్ని సూచిస్తాయన్నారు. వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఐదు సూచనలు చేశారు. అవేంటో చూద్దాం రండి.
* ప్రాసెస్డ్ ఫుడ్‌కి నో చెప్పాలి : రెడీ టూ ఈట్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలను(Processed Foods) తినకుండా ఉండటమే మంచిది. వీటిలో అతి తక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దీంతో ఇవి పేగుల్లోని GI ట్రాక్ట్ లైనింగ్‌కి చెడు చేస్తాయి. జీర్ణక్రియను అస్తవ్యస్తం చేస్తాయి. ఇప్పటికే పేగుల్లో ఉన్న తేడాలను మరింత తీవ్రతరం చేస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే ‘ట్రాన్స్ ఫ్యాట్’ వీటిలో మోతాదుకు మించి ఉంటుంది. దీని వల్ల పేగు వాపులు పెరుగుతాయి. కాబట్టి వీటిని దూరం పెట్టడం తప్పనిసరి.