కాంతులీనే చర్మం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అయితే చర్మాన్ని ఆరోగ్యంగా మెయింటెన్ చేయడం అంత ఈజీ కాదు. కొన్ని పదార్థాల్ని డైలీ రొటీన్లో చేర్చుకుంటే మన చర్మం ఎప్పుడూ మెరుస్తూ, హెల్దీగా ఉంటుంది. అయితే కెమికల్ ప్రొడక్ట్స్‌కు దూరంగా ఉండాలి. నేచురల్, ఆర్గానిక్ స్కిన్ ప్రొడక్ట్స్ వాడటం మొదలుపెట్టాలి.
వీటిలో విటమిన్లు, మినరల్స్, సహజ పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల చర్మానికి హాని చేయవు. పాడైన చర్మాన్ని బాగుచేస్తాయి. చర్మ సౌందర్యంపై ఆసక్తి ఉన్నవారి కోసం ఇన్వేదా(INVEDA) ఫౌండర్, సీఈఓ( CEO) హర్షవర్ధన్ మోడీ కొన్ని విషయాలు షేర్ చేశారు. హెర్బల్, నేచురల్ ఉత్పత్తుల్ని ఇష్టపడేవారు వీటిని వాడి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుకోవచ్చన్నారు.
* కుంకుమాది తైలం : దీనిని క్రమం తప్పకుండా వాడటం వల్ల చర్మం కాంతివంతంగా, యవ్వనంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, మచ్చల్ని తగ్గిస్తుంది. క్లియర్, లైటర్ కలర్ స్కిన్‌ని ఇస్తుంది. ఇందుకు సహకరించే 24 రకాల మూలికలు, నూనెలు ఈ కుంకుమాది(Kumkumadi) తైలంలో ఉంటాయి. ఇంకా కుంకుమపువ్వులోని మంచి గుణాల వల్ల చర్మం రిపేర్ అవుతుంది.
* గోటు కోలా : ఎత్తుపల్లాలు, గడ్డలుగా ఉండే చర్మ సంబంధిత స్కిన్ కండిషన్‌ని సెల్యులైట్ అంటారు. దీనిపై గోటుకోలా(Gotu Kola) ఆకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. కొల్లాజిన్‌ను స్టిమ్యులేట్ చేసి, ఫ్రీ రాడికల్స్, యూవీ(UV) కిరణాల నుండి చర్మాన్ని కాపాడుతుంది. ముడతలు, పిగ్మెంటేషన్, ఏజింగ్‌ను తగ్గిస్తుంది.
* ప్యాచ్యులీ : పాచ్యులీ (Patchouli) అనేది ఓ మొక్క. దీన్ని నుంచి అరోమేటిక్ ఆయిల్ తయారు చేస్తారు. దీనిలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఎక్కువ. మంచి వాసన కలిగి ఉండి శరీర దుర్వాసనను తగ్గిస్తుంది. దీన్ని డియోడరెంట్ల తయారీలోనూ వాడతారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దీనిలో సమృద్ధిగా ఉన్నాయి. స్కిన్ రెడ్నెస్, ఇరిటేషన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది తామర, డెర్మటైటిస్(వాపు) , మొటిమలు, పొడి చర్మం.. లాంటి వాటి చికిత్సలో సహాయ పడుతుంది.