Health Tips for Potatoes : బంగాళాదుంపల్లో కేలరీలు ఎక్కువ, కార్బోహైడ్రేట్స్ (పిండి పదార్థం) కూడా ఎక్కువే. అందువల్ల వీటిని ఎక్కువగా తింటే... బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. అందువల్ల లిమిట్‌గా తినాలి. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఆలూతో చేసిన ఫ్రైలు, చిప్స్ వంటివి తింటున్నారు. నిజానికి ఆలూను కూరల్లో తింటే మంచిదేగానీ... ఇలా ఫ్రైలలా తింటే డేంజరే. ఎందుకంటే ఈ ఫ్రైలు, చిప్స్ వంటివి చాలా టేస్టీగా ఉంటాయి. తిన్నకొద్దీ తినాలనిపిస్తాయి. ఫలితంగా బాడీలోకి ఆయిల్ కొవ్వు బాగా చేరుతుంది. అలాగే... గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. అదే సమయంలో పిండి పదార్థం ఎక్కువై బరువు పెరుగుతారు. వీటన్నిటికీ తోడు... ఇలాంటి ఫ్రైల్లో సాల్ట్ ఎక్కువగా వేస్తారు. అది మన బాడీకి ప్రమాదం. ఎక్కువ సాల్ట్ తింటే... బీపీ వస్తుంది. తల తిరుగుతుంది. ఇంకా చాలా నష్టాలుంటాయి. సో... మనం ఆలూ తినాలి... కానీ జాగ్రత్తగా తినాలి. అదెలాగో తెలుసుకుందాం.
ఫ్రై ఆలూ తినాలనిపిస్తే : బంగాళా దుంపల్ని సన్నగా తరిగి... వాటిని బేకింగ్ ట్రేపై ఓవెన్లో వెయ్యాలి. కొద్దిగా ఆలివ్ ఆయిల్ (మీరు ఏ ఆయిల్ వాడితే అది) టచ్ చెయ్యాలి. అలా లైట్ ఆయిల్లో వేగే ఆలూకి... కొన్ని కూరగాయల్ని జతచేసి... వండి తినవచ్చు. సల్సా, హమ్మూస్ వంటి సాస్ కలిపి తింటే... ఇంకా బాగుంటుంది. (credit - twitter - I don Parry Im nor a parrraa)
స్టఫ్ చేసిన పొటాటో స్కిన్స్ : బంగాళాదుంపల తొక్కల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి. అందువల్ల వాటిని తొక్కలతో సహా తింటే మంచిదే. ఇందుకోసం దుంపల్ని మధ్యలోకి కొయ్యాలి. తొక్కల లోపలి గుజ్జును తీసేయాలి. (ఆ గుజ్జును వేరే కర్రీల కోసం వాడుకోవచ్చు). ఇప్పుడు ఈ తొక్కల్ని ఓవెన్లో (సిమ్‌లో) రోస్ట్ చెయ్యాలి. ఆ తర్వాత వాటిలో కూరగాయలు, మాంసం, వెన్న, ఆకుకూరలు వంటివి కూరి తింటే టేస్ట్ అదిరిపోతుంది. (credit - twitter - Kitchen Sanctuary)
చిన్న దుంపల రోస్ట్: ఇది చాలా తేలిగ్గా చేసే రుచికరమైన పార్టీ డిష్. చిన్న చిన్న దుంపల్ని చక్కగా కడిగి... నీరు తొలగిన తర్వాత... ఆలివ్ ఆయిల్లో వెయ్యాలి. హై టెంపరేచర్లో వేపాలి. అవి పసుపు, గోధుమ రంగులోకి మారేవరకూ వేపాలి. వీటికి ఇతర చెర్రీ టమాటాలు, కూరగాయల్లాంటివి జతచేసి తినవచ్చు. (credit - twitter - Chef Christine Green)