ఈ చేపలు తినే దంపతులు ప్రతివారం సంతానోత్పత్తిని పెంచుతారని తాజా అధ్యయనంలో తేలింది. పెళ్లయిన ఏడాదిలోపు ఉన్న దంపతులు ఈ చేపలు తింటే.. ఆ తర్వాత వారి లైంగిక జీవితం హాయిగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు. బోస్టన్లోని హార్వర్డ్ TH చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారి అధ్యయనం ప్రకారం.. ఈ చేపల్ని తింటే లైంగిక కోరికలు పెరుగుతాయ్. అలాగే, సంతానోత్పత్తి రేటు కూడా పెరుగుతుందట.
ఇది బరువును నియంత్రిస్తుంది. ధమనులలో రక్త ప్రవాహాన్ని సాధారణం చేస్తుందని ఆమె అంటున్నారు. అంతేగాక.. ఇందులో ఉండే డబుల్ ఫ్యాటీ సాటిసిఫైడ్ ఆమ్లాలు.. మధుమేహం, గుండె జబ్బులు మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయటపులసల వంటి సముద్ర చేపలలోని ఒమేగా త్రీ, కొవ్వు ఆమ్లాలు గుండె, కళ్ళు మరియు ఎముకల నిర్మాణాన్ని క్రమంగా ఉంచుతాయని డైటీషియన్లు చెబుతున్నారు. మోనో మరియు పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు నరాల నష్టాన్ని నివారిస్తాయట.
ప్రతి ఏడాది బెంగాల్ నుంచి వందలాది టన్నుల పులస చేపలు.. ఇతర రాష్ట్రాలకు దిగుమతి అవుతాయ్. అంతకుముందు బంగ్లాదేశ్ నుంచి ఎక్కువగా దిగుమతి అయ్యే ఈ చేపలను.. కొద్దికాలం నుంచి బెంగాల్ లోని ఫరక్కాలోనూ పెంచుతున్నారు. ఫలితంగా, హిల్సా మార్కెట్లో చాలా తక్కువ ధరకే లభ్యమవుతున్నది.ఈ పులసలలో ఇనుము, జింక్ మరియు మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇంకెందుకాలస్యం.. మార్కెట్ కు వెళ్లి పులస చేపలను తెచ్చుకోండి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోండి. (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)